2రాజులు 18: 26
క్రాస్-రిఫరెన్స్‌లు
" హిల్కీయా కుమారుడైన ఎల్యాకీము షెబ్నాయు యోవాహు అనువారు చిత్తగించుము, నీ దాసులమైన మాకు సిరియా భాష తెలియును గనుక దానితో మాటలాడుము; ప్రాకారముమీద నున్న ప్రజల వినికిడిలో యూదుల భాషతో మాటలాడకుమని రబ్షాకేతో అనగా"
సంబంధిత రిఫరెన్స్‌లు
అర్తహషస్త యొక్క దినములలో బిష్లామును మిత్రిదాతును టాబెయేలును వారి పక్షముగానున్న తక్కిన వారును పారసీకదేశపు రాజైన అర్తహషస్తకు ఉత్తరము వ్రాసి పంపిరి. ఆ యుత్తరము సిరియా భాషలో వ్రాయబడి సిరియా భాషలోనే తాత్పర్యము చేయబడినది.
ఎల్యాకీము షెబ్నా యోవాహు అను వారు చిత్తగించుము నీ దాసులమైన మాకు సిరియా భాష తెలియును గనుక దానితో మాటలాడుము, ప్రాకారముమీదనున్న ప్రజల వినికిడిలో యూదుల భాషతో మాటలాడకుమని రబ్షాకేతో అనగా
రబ్షాకే ఈ మాటలు చెప్పుటకై నా యజమానుడు నీ యజమానునియొద్దకును నీయొద్దకును నన్ను పంపెనా? తమ మలమును తినునట్లును తమ మూత్రమును త్రాగునట్లును మీతోకూడ ప్రాకారముమీద ఉన్న వారియొద్దకును నన్ను పంపెను గదా అని చెప్పి
కల్దీయులు సిరియా బాషతో ఇట్లనిరి రాజు చిరకాలము జీవించునుగాక. తమరి దాసులకు కల సెలవియ్యుడి; మేము దాని భావమును తెలియజేసెదము.
అప్పుడు వారు పట్టణమును పట్టుకొనవలెనన్న యోచనతో, ప్రాకారము మీదనున్న యెరూషలేము కాపురస్థులను బెదరించుటకును నొప్పించుటకును, యూదాభాషలో బిగ్గరగా వారితో ఆ మాటలు పలికిరి.
అంతట అయిదవమారు సన్బల్లటు తన పనివాని ద్వారా విప్పియున్న యొక పత్రికను నాయొద్దకు పంపెను.
సీవాను అను మూడవ నెలలో ఇరువది మూడవ దినమందు రాజుయొక్క వ్రాతగాండ్రు పిలువబడిరి; మొర్దెకై ఆజ్ఞాపించిన ప్రకారమంతయు యూదులకును, హిందూ దేశము మొదలుకొని కూషు దేశమువరకు వ్యాపించియున్న నూట ఇరువది యేడు సంస్థానములలో నున్న అధిపతులకును అధికారులకును, ఆ యా సంస్థానములకును దాని దాని వ్రాతనుబట్టియు దాని దాని భాషనుబట్టియు తాకీదులు వ్రాయబడెను.
అయితే అతనికి ప్రత్యుత్తరమియ్యవద్దని రాజు సెలవిచ్చియుండుటచేత వారెంతమాత్రమును ప్రత్యుత్తరమియ్యక ఊరకొనిరి.
ఎందుకనగా భాషతో మాటలాడువాడు మనుష్యులతో కాదు దేవునితో మాటలాడుచున్నాడు; మనుష్యుడెవడును గ్రహింపడు గాని వాడు ఆత్మవలన మర్మములను పలుకుచున్నాడు.