2రాజులు 25: 16
క్రాస్-రిఫరెన్స్‌లు
" మరియు అతడు యెహోవా మందిరమునకు సొలొమోను చేయించిన రెండు స్తంభములను సముద్రమును మట్లను తీసికొనిపోయెను. ఈ యిత్తడి వస్తువులయెత్తు లెక్కకు మించియుండెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
అయితే ఈ ఉపకరణములు అతి విస్తారములైనందున సొలొమోను ఎత్తు చూచుట మానివేసెను; ఇత్తడియొక్క యెత్తు ఎంతైనది తెలియబడకపోయెను.
ఏమనగా అతడు రెండు ఇత్తడి స్తంభములు పోత పోసెను; ఒక్కొక్క స్తంభము పదునెనిమిది మూరల నిడివి గలది, ఒక్కొక్కటి పండ్రెండు మూరల కైవారము గలది.
మరియు అతడు పది యిత్తడి స్తంభములు చేసెను; ఒక్కొక్క స్తంభము నాలుగు మూరల పొడుగు, నాలుగు మూరల వెడల్పు, మూడు మూరల యెత్తు కలిగి యుండెను.
ఇదిగో నేను నా కష్ట స్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు రెండులక్షల మణుగుల బంగారమును పదికోట్ల మణుగుల వెండిని తూచ శక్యముకానంత విస్తారమైన యిత్తడిని యినుమును సమకూర్చియున్నాను; మ్రానులను రాళ్లను కూర్చి యుంచితిని; నీవు ఇంకను సంపాదించుదువుగాక.
రాజైన సొలొమోను యెహోవా మందిరమునకు చేయించిన రెండు స్తంభములను సముద్రమును మట్లక్రిందనుండిన పండ్రెండు ఇత్తడి వృషభములను గొనిపోయెను. వీటికన్నిటికున్న ఇత్తడి యెత్తువేయుటకు అసాధ్యము.