2రాజులు 25: 23
క్రాస్-రిఫరెన్స్‌లు
" యూదావారి సైన్యాధిపతులందరును వారి జనులందరును బబులోనురాజు గెదల్యాను అధిపతిగా నియమించిన సంగతి విని, మిస్పా పట్టణమందున్న గెదల్యాయొద్దకు నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును, కారేహ కుమారుడైన యోహానానును, నెటోపాతీయుడైన తన్హుమెతు కుమారుడగు శెరాయాయును, మాయకాతీయుడైన యొకనికిపుట్టిన యజన్యాను కూడి రాగా"
సంబంధిత రిఫరెన్స్‌లు
అయితే అచ్చటచ్చటనుండు సేనల యధిపతులందరును వారి పటాలపువారును, బబులోనురాజు అహీకాము కుమారుడైన గెదల్యాను దేశముమీద అధికారిగా నియమించి, బబులోనునకు చెరగొని పోబడక నిలిచినవారిలో స్త్రీలను పురుషులను పిల్లలను, దేశములోని అతినీరసులైన దరిద్రులను అతనికి అప్పగించెనని వినిరి.
కాగా నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును కారేహ కుమారులైన యోహానాను యోనాతానులును తన్హుమెతు కుమారుడైన శెరాయాయును నెటోపాతీయుడైన ఏపయి కుమారులును మాయకాతీయుడైనవాని కుమారుడగు యెజన్యాయును వారి పటాలపువారును మిస్పాలో నుండిన గెదల్యాయొద్దకు వచ్చిరి.
అప్పుడు షాఫాను కుమారుడైన అహీకాము కుమారుడగు గెదల్యా ప్రమాణముచేసి వారితోను వారి పటాలపువారితోను ఈలాగు చెప్పెను మీరు కల్దీయులను సేవించుటకు భయపడకుడి, దేశములో కాపురముండి బబులోనురాజును సేవించినయెడల మీకు మేలు కలుగును.
మోయాబులో నేమి అమ్మోనీయుల మధ్యనేమి ఎదోములో నేమి యేయే ప్రదేశములలోనేమి యున్న యూదులందరు బబులోను రాజు యూదాలో జనశేషమును విడిచెననియు, షాఫాను కుమారుడైన అహీకాము కుమారుడగు గెదల్యాను వారిమీద నియమించెననియు వినినప్పుడు
అందరును తాము తోలివేయబడిన స్థలములన్నిటిని విడిచి మిస్పాకు గెదల్యాయొద్దకు వచ్చి బహు విస్తారము ద్రాక్షారసమును వేసవికాలపు పండ్లను సమకూర్చుకొనిరి.
అంతట లాబాను నీవు నా కుమార్తెలను బాధ పెట్టినను, నా కుమార్తెలను గాక యితర స్త్రీలను పెండ్లి చేసికొనినను,
హెర్మోనులోను హెష్బోనురాజైన సీహోను సరిహద్దు వరకు గిలాదు అర్దభాగములోను రాజ్యమేలినవాడు.
అంతట ఇశ్రాయేలీయులందరు బయలుదేరి దాను మొదలుకొని బెయేర్షెబావరకును గిలాదుదేశమువరకును వారి సమాజము ఏకమనస్సు కలిగి మిస్పాలో యెహోవా సన్నిధిని కూడెను.
అంతట సమూయేలు ఇశ్రాయేలీయులందరిని మిస్పాకు పిలువనంపుడి; నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా
అహిమయస్సు అజర్యాను కనెను, అజర్యా యోహానానును కనెను,
ప్రధానులందరు కూషీకి ఇనుమనుమడును షెలెమ్యాకు మనుమడును నెతన్యాకు కుమారుడునైన యెహూదిని బారూకు నొద్దకు పంపి నీవు ప్రజల వినికిడిలో చదివిన పుస్తకమును చేతపట్టుకొని రమ్మని ఆజ్ఞ నియ్యగా నేరీయా కుమారుడగు బారూకు ఆ గ్రంథమును చేతపట్టుకొని వచ్చెను.
కాగా నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును కారేహ కుమారులైన యోహానాను యోనాతానులును తన్హుమెతు కుమారుడైన శెరాయాయును నెటోపాతీయుడైన ఏపయి కుమారులును మాయకాతీయుడైనవాని కుమారుడగు యెజన్యాయును వారి పటాలపువారును మిస్పాలో నుండిన గెదల్యాయొద్దకు వచ్చిరి.
అంతలో సేనాధిపతులందరును కారేహ కుమారుడైన యోహానానును హోషేయా కుమారుడైన యెజన్యాయును, అల్పులేమి ఘనులేమి ప్రజలందరును ప్రవక్తయైన యిర్మీయాయొద్దకు వచ్చి అతనితో ఈలాగు మనవిచేసిరి
పిమ్మట ఆత్మ నన్ను ఎత్తి యెహోవా మందిరపు తూర్పు గుమ్మము నొద్దకు చేర్చి నన్ను దింపగా గుమ్మపు వాకిట ఇరువదియైదుగురు మనుష్యులు కనబడిరి; వారిలో జనులకు ప్రధానులైన అజ్జూరు కుమారుడగు యజన్యాయు బెనాయా కుమారుడగు పెలట్యాయు నాకు కనబడిరి.
దేశపు జనులందరికిని యాజకులకును నీవీమాట తెలియజేయవలెను. ఈ జరిగిన డెబ్బది సంవత్సరములు ఏటేట అయిదవ నెలను ఏడవ నెలను మీరు ఉపవాసముండి దుఃఖము సలుపుచు వచ్చినప్పుడు, నాయందు భక్తికలిగియే ఉపవాసముంటిరా?