లేఖనాలను అన్వేషించండి

2రాజులు 4: 2

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఎలీషా నావలన నీకేమి కావలెను? నీ యింటిలో ఏమి యున్నదో అది నాకు తెలియజెప్పుమనెను. అందుకామె నీ దాసురాలనైన నా యింటిలో నూనెకుండ యొకటియున్నది; అది తప్ప మరేమియు లేదనెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

2రాజులు 2:9

వారు దాటిపోయిన తరువాత ఏలీయా ఎలీషాను చూచి నేను నీయొద్దనుండి తీయబడకమునుపు నీకొరకు నేనేమి చేయకోరుదువో దాని నడుగుమని చెప్పగా ఎలీషా నీకు కలిగిన ఆత్మలో రెండుపాళ్లు నా మీదికి వచ్చునట్లు దయచేయుమనెను.

2రాజులు 6:26

అంతట ఇశ్రాయేలు రాజు పట్టణపు ప్రాకారముమీద సంచారము చేయగా ఒక స్త్రీ రాజును చూచి రాజవైన నా యేలినవాడా, సహాయము చేయుమని కేకలు వేయుట విని

2రాజులు 6:27

యెహోవా నీకు సహాయము చేయనిది నేనెక్కడనుండి నీకు సహాయము చేయుదును? కళ్లములోనుండి యైనను ద్రాక్షగానుగలోనుండి యైనను దేనినైనను ఇచ్చి సహాయము చేయ వల్లపడదని చెప్పి

మత్తయి 15:34

యేసు మీయొద్ద ఎన్ని రొట్టెలున్నవని వారినడుగగా వారు ఏడు రొట్టెలును కొన్ని చిన్న చేపలును ఉన్నవని చెప్పిరి.

యోహాను 6:5

కాబట్టి యేసు కన్నులెత్తి బహు జనులు తనయొద్దకు వచ్చుట చూచి వీరు భుజించుటకు ఎక్కడనుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పునడిగెను గాని

యోహాను 6:6

యేమి చేయనైయుండెనో తానే యెరిగియుండి అతనిని పరీక్షించుటకు ఆలాగడిగెను.

యోహాను 6:7

అందుకు ఫిలిప్పు వారిలో ప్రతివాడును కొంచెము కొంచెము పుచ్చుకొనుటకైనను రెండువందల దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పెను.

అపోస్తలులకార్యములు 3:6

అంతట పేతురు వెండి బంగారములు నాయొద్ద లేవుగాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను; నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి

2కొరిందీయులకు 6:10

దుఃఖపడినవారమైనట్లుండియు ఎల్లప్పుడు సంతోషించువారము; దరిద్రులమైనట్లుండియు అనేకులకు ఐశ్వర్యము కలిగించువారము; ఏమియు లేనివారమైనట్లుండియు సమస్తమును కలిగినవారము.

1రాజులు 17:12

అందుకామె నీ దేవుడైన యెహోవా జీవముతోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నాయొద్దనున్నవే గాని అప్పమొకటైన లేదు, మేము చావకముందు నేను ఇంటికిపోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసికొనవలెనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చితిననెను.

యాకోబు 2:5

నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి; ఈ లోక విషయములో దరిద్రులైనవారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించువారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడేర్పరచుకొనలేదా?

1రాజులు 17:14

భూమిమీద యెహోవా వర్షము కురిపించువరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువకాదు, బుడ్డిలో నూనె అయిపోదని

సామెతలు 18:23

దరిద్రుడు బతిమాలి మనవి చేసికొనును ధనవంతుడు దురుసుగా ప్రత్యుత్తరమిచ్చును.

మార్కు 8:8

వారు భోజనముచేసి తృప్తిపొందినమీదట, మిగిలిన ముక్కలు ఏడు గంపలనిండ ఎత్తిరి.

యోహాను 2:7

యేసు--ఆ బానలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచులమట్టుకు నింపిరి.

యోహాను 6:13

కాబట్టి వారు భుజించిన తరువాత వారియొద్ద మిగిలిన అయిదు యవల రొట్టెల ముక్కలు పోగుచేసి పండ్రెండు గంపలు నింపిరి.