లేఖనాలను అన్వేషించండి

2రాజులు 4: 24

క్రాస్-రిఫరెన్స్‌లు

" గాడిదకు గంతకట్టించి తాను ఎక్కి తన పనివానితో శీఘ్రముగా తోలుము, నేను నీకు సెలవిచ్చితేనే గాని నిమ్మళముగా తోలవద్దనెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

నిర్గమకాండము 4:20

మోషే తన భార్యను తన కుమారులను తీసికొని గాడిదమీద నెక్కించుకొని ఐగుప్తుకు తిరిగి వెళ్లెను. మోషే దేవుని కఱ్ఱను తనచేత పట్టుకొనిపోయెను.

1సమూయేలు 25:20

గార్దభముమీద ఎక్కి పర్వతపు లోయలోనికి వచ్చుచుండగా, దావీదును అతని జనులును ఆమెకు ఎదురుపడిరి, ఆమె వారిని కలిసికొనెను.

1రాజులు 13:13

పిమ్మట అతడు తన కుమారులను పిలిచి నాకొరకు గాడిదకు గంతకట్టుడని చెప్పగా వారు అతని కొరకు గాడిదకు గంతకట్టిరి. అతడు దానిమీద ఎక్కి దైవజనుని కనుగొనవలెనని పోయి

1రాజులు 13:23

అంతట వారు అన్నపానములు పుచ్చుకొనిన తరువాత అచ్చటి ప్రవక్త తాను వెనుకకు తోడుకొని వచ్చిన ఆ ప్రవక్తకు గాడిదమీద గంత కట్టించెను.

1సమూయేలు 25:19

మీరు నాకంటె ముందుగా పోవుడి, నేను మీ వెనుకనుండి వచ్చెదనని తన పనివారికి ఆజ్ఞనిచ్చి

యెహోషువ 10:6

గిబియోనీయులుమన్యములలో నివసించు అమోరీయుల రాజులందరు కూడి మా మీదికిదండెత్తి వచ్చియున్నారు గనుక, నీ దాసులను చెయ్యి విడువక త్వరగా మాయొద్దకు వచ్చి మాకు సహా యముచేసి మమ్మును రక్షించుమని గిల్గాలులో దిగియున్న పాళెములో యెహోషువకు వర్తమానము పంపగా

2రాజులు 4:22

ఒక పనివానిని ఒక గాడిదను నాయొద్దకు పంపుము;నేను దైవజనుని యొద్దకు పోయివచ్చెదనని తన పెనిమిటితో ఆమె యనగా

లూకా 10:4

మీరు సంచినైనను జాలెనైనను చెప్పులనైనను తీసికొనిపోవద్దు;