2రాజులు 5: 2
క్రాస్-రిఫరెన్స్‌లు
" సిరియనులు గుంపు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశముమీదికి పోయియుండిరి. వారచ్చటనుండి యొక చిన్నదాని చెరగొని తేగా, అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
అతడు వారికొరకు విస్తారమైన భోజన పదార్థములను సిద్ధపరచగా వారు అన్నపానములు పుచ్చుకొని రాజు సెలవుపొంది తమ యజమానునియొద్దకు పోయిరి. అప్పటినుండి సిరియనుల దండువారు ఇశ్రాయేలు దేశములోనికి వచ్చుట మానిపోయెను.
తరువాత ఎలీషా మృతిపొందగా వారు అతనిని సమాధిలో ఉంచిరి. ఒక సంవత్సరము గడచిన తరువాత మోయాబీయుల సైన్యము దేశముమీదికి వచ్చినప్పుడు
అబీమెలెకును అతనితోనున్న జనులందరును రాత్రివేళ లేచి నాలుగు గుంపులై షెకెముమీద పడుటకు పొంచి యుండిరి.
మరియు ఫిలిష్తీయుల పాళెములోనుండి దోపుడుగాండ్రు మూడు గుంపులుగా బయలుదేరి ఒక గుంపు షూయాలు దేశమున, ఒఫ్రాకు పోవు మార్గమున సంచరించెను.
రెండవ గుంపు బేత్ హోరోనుకు పోవు మార్గమున సంచరించెను. మూడవ గుంపు అరణ్య సమీపమందుండు జెబోయిములోయ సరిహద్దు మార్గమున సంచరించెను.
దాసుల కన్నులు తమ యజమానుని చేతితట్టును దాసి కన్నులు తన యజమానురాలి చేతితట్టును చూచునట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించువరకు మన కన్నులు ఆయనతట్టు చూచుచున్నవి.
సౌలు కుమారునికి సైన్యాధిపతులుండిరి; వారిలో ఒకని పేరు బయనా, రెండవవానిపేరు రేకాబు; వీరు బెన్యామీనీయులకు చేరిన బెయేరోతీయుడగు రిమ్మోను కుమారులు. బెయే రోతుకూడను బెన్యామీనీయుల దేశములో చేరినదని యెంచబడెను.
యుద్ధమునకు ఉజ్జియాకు సైన్యము కలిగియుండెను; అందులోని యోధులు రాజు అధిపతులలో హనన్యా అనువాని చేతిక్రిందనుండిరి. ఖజానాదారుడగు మయశేయాయు ప్రధానమంత్రియగు యెహీయేలును వారి లెక్క ఎంతైనది చూచి వారిని పటాలముగా ఏర్పరచువారై యుండిరి.
అంజూరపు చెట్టును పెంచువాడు దాని ఫలము తినును తన యజమానుని మన్నించువాడు ఘనతనొందును.
ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగియై చావ సిద్ధమైయుండెను.
మనుష్యులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే యిష్టపూర్వకముగా సేవచేయుడి.
దేవుని నామమును ఆయన బోధయు దూషింపబడకుండునట్లు దాసత్వమను కాడిక్రింద ఉన్నవారందరును, తమ యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రులని యెంచవలెను.