లేఖనాలను అన్వేషించండి

2రాజులు 5: 23

క్రాస్-రిఫరెన్స్‌లు

" అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసికొనుమని బతిమాలి, రెండు సంచులలో నాలుగు మణుగుల వెండి కట్టి రెండు దుస్తుల బట్టలనిచ్చి, తన పనివారిలో ఇద్దరిమీద వాటిని వేయగా వారు గేహజీ ముందర వాటిని మోసికొనిపోయిరి."

సంబంధిత రిఫరెన్స్‌లు

1రాజులు 20:7

కాగా ఇశ్రాయేలు రాజు దేశపు పెద్దలనందరిని పిలువనంపించి బెన్హదదు నీ భార్యలను పిల్లలను వెండి బంగారములను పట్టుకొందునని వర్తమానము పంపగా నేను ఇయ్యనని చెప్పలేదు; ఆ మనుష్యుడు చేయగోరుచున్న మోసము ఎట్టిదో అది మీరు తెలిసికొనుడనెను.

లూకా 11:54

వదకుచు చాల సంగతులనుగూర్చి ఆయనను మాటలాడింపసాగిరి.

2రాజులు 5:16

ఎలీషా ఎవని సన్నిధిని నేను నిలువబడియున్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నేనేమియు తీసికొనను అని చెప్పెను. నయమాను అతనిని ఎంతో బతిమాలినను అతడు ఒప్పక పోయెను.

2రాజులు 2:17

అతడు ఒప్పవలసినంత బలవంతము చేసి వారతని బతిమాలగా అతడు పంపుడని సెలవిచ్చెను గనుక వారు ఏబదిమందిని పంపిరి. వీరు వెళ్లి మూడు దినములు అతనిని వెదకినను అతడు వారికి కనబడకపోయెను.

2రాజులు 12:10

పెట్టెలో ద్రవ్యము విస్తారముగా ఉన్నదని వారు తెలియజేయగా రాజుయొక్క ప్రధాన మంత్రియును ప్రధాన యాజకుడును వచ్చి, యెహోవా మందిరమందు దొరికిన ద్రవ్యము లెక్కచూచి సంచులలో ఉంచిరి.

యెషయా 30:6

దక్షిణ దేశములోనున్న క్రూరమృగములనుగూర్చిన దేవోక్తి సింహీ సింహములును పాములును తాపకరమైన మిడునాగులు నున్న మిక్కిలి శ్రమ బాధలుగల దేశముగుండ వారు గాడిదపిల్లల వీపులమీద తమ ఆస్తిని ఒంటెల మూపులమీద తమ ద్రవ్యములను ఎక్కించుకొని తమకు సహాయము చేయలేని జనమునొద్దకు వాటిని తీసికొనిపోవుదురు.

ఆదికాండము 33:11

నేను నీయొద్దకు తెచ్చిన కానుకను చిత్తగించి పుచ్చుకొనుము; దేవుడు నన్ను కనికరించెను; మరియు నాకు కావలసినంత ఉన్నదని చెప్పి అతని బలవంతము చేసెను గనుక అతడు దాని పుచ్చుకొని

ఆదికాండము 45:22

అతడు వారికి రెండేసి దుస్తుల బట్టలు ఇచ్చెను; బెన్యామీనుకు మూడువందల తులముల వెండియును ఐదు దుస్తుల బట్టలు ఇచ్చెను,

2రాజులు 6:3

ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో కూడ నీవు రావలెనని కోరగా అతడు నేను వచ్చెదనని చెప్పి

మీకా 6:10

అన్యాయము చేయువారి యిండ్లలో అన్యాయముచేత సంపాదించిన సొత్తులును, చిన్నదిగా చేయబడిన హేయమైన కొలయు ఉన్నవి గదా.