లేఖనాలను అన్వేషించండి

2రాజులు 8: 17

క్రాస్-రిఫరెన్స్‌లు

" అతడు ఏల నారంభించినప్పుడు ముప్పది రెండేండ్లవాడై యుండి యెరూషలేమందు ఎనిమిది సంవత్సరములు ఏలెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

2రాజులు 1:17

ఏలీయా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాటప్రకారము అతడు చనిపోయెను. అతనికి కుమారుడు లేనందున యూదా రాజైన యెహోషాపాతు కుమారుడైన యెహోరాము ఏలుబడిలో రెండవ సంవత్సరమందు యెహోరాము అతనికి మారుగా రాజాయెను.

2రాజులు 8:25

అహాబు కుమారుడును ఇశ్రాయేలు రాజునైన యెహోరాము ఏలుబడిలో పండ్రెండవ సంవత్సరమందు యూదా రాజైన యెహోరాము కుమారుడైన అహజ్యా యేలనారంభించెను.

2రాజులు 8:26

అహజ్యా యేలనారంభించినప్పుడు ఇరువది రెండేండ్ల వాడై యుండి యెరూషలేములో ఒక సంవత్సరము ఏలెను. అతని తల్లిపేరు అతల్యా; ఈమె ఇశ్రాయేలు రాజైన ఒమీ కుమార్తె.

2దినవృత్తాంతములు 21:1

యెహోషాపాతు తన పితరులతోకూడ నిద్రించితన పితరుల చెంతను దావీదు పురమందు పాతిపెట్టబడెను, అతని కుమారుడైన యెహోరాము అతనికి బదులుగా రాజాయెను.

2దినవృత్తాంతములు 21:5

యెహోరాము ఏలనారంభించినప్పుడు ముప్పది రెండేండ్లవాడు. అతడు యెరూషలేములో ఎనిమిది సంవత్సరములు ఏలెను.