2రాజులు 8: 22
క్రాస్-రిఫరెన్స్‌లు
" అయితే నేటివరకును ఎదోమీయులు తిరుగుబాటు చేసి యూదావారికి లోబడకయే యున్నారు. మరియు ఆ సమయమందు లిబ్నా పట్టణమును తిరుగబడెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
నీవు నీ కత్తిచేత బ్రదుకుదువు నీ సహోదరునికి దాసుడవగుదువు నీవు తిరుగులాడుచుండగా నీ మెడమీదనుండి అతనికాడి విరిచివేయుదువు అని అతని కుత్తరమిచ్చెను.
ఇతని దినములలో ఎదోమీయులు యూదా రాజునకు ఇక లోబడుట మాని అతనిమీద తిరుగుబాటు చేసి, తమమీద నొకని రాజుగా నియమించుకొనినందున
అష్షూరు రాజు లాకీషు పట్టణమును విడిచివెళ్లి లిబ్నామీద యుద్ధము చేయుచుండగా రబ్షాకే పోయి అతని కలిసికొనెను.
యాజకుడైన అహరోను సంతానపువారికి వారు నర హంతకునికి ఆశ్రయపట్టణమైన హెబ్రోనును
కాగా నేటివరకును జరుగుచున్నట్టు ఎదోమీయులు యూదావారి చేతిక్రింద నుండక తిరుగబడిరి. యెహోరాము తన పితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందున ఆ కాలమందు లిబ్నాయును అతని చేతిక్రిందనుండి తిరుగబడెను.
యెహోషువయు అతనితో కూడ ఇశ్రాయేలీయు లందరును మక్కేదానుండి లిబ్నాకు వచ్చి లిబ్నా వారితో యుద్ధముచేసిరి.
లిబ్నా ఎతెరు ఆషాను యిప్తా అష్నానెసీబు
అహాబు మరణమైన తరువాత మోయాబీయులు ఇశ్రాయేలువారిమీద తిరుగబడిరి.
అష్షూరు రాజు లాకీషు పట్టణమును విడిచివెళ్లి లిబ్నామీద యుద్ధము చేయుచుండగా రబ్షాకే పోయి అతని కలిసికొనెను.