అపోస్తలులకార్యములు 16: 3
క్రాస్-రిఫరెన్స్‌లు
" అతడు తనతోకూడ బయలుదేరి రావలెనని పౌలు కోరి, అతని తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రదేశములోని యూదులకందరికి తెలియును గనుక వారినిబట్టి అతని తీసికొని సున్నతి చేయించెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
కాబట్టి సహోదరులారా, ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచిపేరు పొందిన యేడుగురు మనుష్యులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము;
మరియు అతడు నిందపాలై అపవాది ఉరిలో పడిపోకుండునట్లు సంఘమునకు వెలుపటివారిచేత మంచి సాక్ష్యము పొందినవాడై యుండవలెను.
సత్‌క్రియలకు పేరుపొందిన విధవరాలు పిల్లలను పెంచి, పరదేశులకు అతిథ్యమిచ్చి, పరిశుద్ధుల పాదములు కడిగి, శ్రమపడువారికి సహాయము చేసి, ప్రతి సత్కార్యము చేయ బూనుకొనినదైతే ఆమెను విధవరాండ్ర లెక్కలో చేర్చవచ్చును.
అటువలె మంచి కార్యములు తేటగా బయలుపడుచున్నవి, బయలుపడనివి దాచబడనేరవు.
నీవు నేర్చుకొని రూఢియని తెలిసికొన్నవి యెవరివలన నేర్చుకొంటివో ఆ సంగతి తెలిసికొని, వాటియందు నిలుకడగా ఉండుము.
దానినిబట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి.
వారు ఆ పట్టణములో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులనుగా చేసిన తరువాత లుస్త్రకును ఈకొనియకును అంతియొకయకును తిరిగివచ్చి
అంతియొకయ ఈకొనియ లుస్త్ర అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను, తెలిసికొనినవాడవై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించితిని గాని, వాటన్నిటిలోనుండి ప్రభువు నన్ను తప్పించెను
వీరు తమ పాదధూళిని వారితట్టు దులిపివేసి ఈకొనియకు వచ్చిరి.
వారాసంగతి తెలిసికొని లుకయొనియలోని పట్టణములగు లుస్త్రకును దెర్బేకును చుట్టుపట్లనున్న ప్రదేశమునకును పారిపోయి అక్కడ సువార్త ప్రకటించుచుండిరి.