అపోస్తలులకార్యములు 16: 36
క్రాస్-రిఫరెన్స్‌లు
" చెరసాల నాయకుడీమాటలు పౌలునకు తెలిపి మిమ్మును విడుదలచేయుమని న్యాయాధిపతులు వర్తమానము పంపియున్నారు గనుక మీరిప్పుడు బయలుదేరి సుఖముగా పొండని చెప్పెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
ప్రజలందరు జరిగిన దానినిగూర్చి దేవుని మహిమపరచుచుండిరి గనుక సభవారు ప్రజలకు భయపడి, వీరిని శిక్షించు విధమేమియు కనుగొనలేక వీరిని గట్టిగా బెదరించి విడుదలచేసిరి.
వారతని మాటకు సమ్మతించి, అపొస్తలులను పిలిపించి కొట్టించి యేసు నామమునుబట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి.
నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును ఆగ్రహ శేషమును నీవు ధరించుకొందువు.
సముద్రము దాటలేకుండునట్లును, దాని తరంగము లెంత పొర్లినను అవి ప్రబలలేకయు, ఎంత ఘోషించినను దాని దాటలేకయు ఉండునట్లును నిత్య నిర్ణయముచేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? నా సన్నిధిని వణకరా? ఇదే యెహోవా వాక్కు.
యెహోషువ యొర్దానులోనుండి యెక్కి రండని ఆ యాజకుల కాజ్ఞా పించెను.
మరునాడు పషూరు యిర్మీయాను బొండలోనుండి విడిపింపగా యిర్మీయా అతనితో ఇట్లనెను యెహోవా నీకు పషూరను పేరు పెట్టడు గాని మాగోర్మిస్సాబీబ్ అని నీకు పేరు పెట్టును.