అపోస్తలులకార్యములు 7: 34
క్రాస్-రిఫరెన్స్‌లు
" ఐగుప్తులోనున్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచితిని; వారి మూలుగు వింటిని; వారిని విడిపించుటకు దిగివచ్చి యున్నాను; రమ్ము, నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదునని అతనితో చెప్పెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
అందుకాయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచియున్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను.
అందుకు యెహోవా సేనాధిపతి నీవు నిలిచియున్న యీ స్థలము పరిశుద్ధమైనది, నీ పాద రక్షలను తీసి వేయుమని యెహోషువతో చెప్పగా యెహో షువ ఆలాగు చేసెను.
నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము; బుద్ధిహీనులు అర్పించునట్లుగా బలి అర్పించుటకంటె సమీపించి ఆలకించుట శ్రేష్ఠము; వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు.
మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడ ఉండినవారమై, ఆ శబ్దము ఆకాశమునుండి రాగా వింటిమి.