ప్రసంగి 1: 7
క్రాస్-రిఫరెన్స్‌లు
" నదులన్నియు సముద్రములో పడును, అయితే సముద్రము నిండుటలేదు; నదులు ఎక్కడనుండి పారివచ్చునో అక్కడికే అవి ఎప్పుడును మరలిపోవును"
సంబంధిత రిఫరెన్స్‌లు
మరుగుస్థానములోనుండి తుఫాను వచ్చును ఉత్తరదిక్కునుండి చలి వచ్చును
దక్షిణపు గాలి వీచుటచేత ఉబ్బవేయునప్పుడు నీ వస్త్రములెట్లు వెచ్చబడినది నీకు తెలియునా?
ఆయన సెలవియ్యగా తుపాను పుట్టెను అది దాని తరంగములను పైకెత్తెను
ఆయన తుపానును ఆపివేయగా దాని తరంగములు అణగిపోయెను.
అయితే యెహోవా సముద్రముమీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుపాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చెను.
కాబట్టి యీ నా మాటలు విని వాటిచొప్పున చేయు ప్రతివాడును బండమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును.
వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ యింటిమీద కొట్టెను, అప్పుడది కూలబడెను; దాని పాటు గొప్పదని చెప్పెను.
గాలి తన కిష్టమైన చోటను విసరును; నీవు దాని శబ్దము విందువేగాని అది యెక్కడనుండి వచ్చునో యెక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మమూలముగా జన్మించిన ప్రతివాడును ఆలాగే యున్నాడనెను.
మరియు దక్షిణపు గాలి మెల్లగా విసరుచుండగా వారు తమ ఆలోచన సమకూడినదని తలంచి లంగరెత్తి, క్రేతు దరిని ఓడ నడిపించిరి.
కొంచెముసేపైన తరువాత ఊరకులోను అను పెనుగాలి క్రేతు మీదనుండి విసరెను.
దానిలో ఓడ చిక్కుకొని గాలికి ఎదురు నడువలేకపోయినందున ఎదురు నడిపించుట మాని గాలికి కొట్టుకొనిపోతివిు.
పలుకబడిన మాటలలో నిరర్థకమైన మాటలు చాల ఉండును; వాటివలన నరులకేమి లాభము?