లేఖనాలను అన్వేషించండి

ప్రసంగి 11: 5

క్రాస్-రిఫరెన్స్‌లు

" చూలాలి గర్బమందు ఎముకలు ఏరీతిగా ఎదుగునది నీకు తెలియదు, గాలి యే త్రోవను వచ్చునో నీవెరుగవు, ఆలాగునే సమస్తమును జరిగించు దేవుని క్రియలను నీవెరుగవు."

సంబంధిత రిఫరెన్స్‌లు

సామెతలు 3:27

మేలుచేయుట నీచేతనైనప్పుడు దాని పొందదగినవారికి చేయకుండ వెనుకతియ్యకుము.

సామెతలు 20:4

విత్తులువేయు కాలమున సోమరి దున్నడు కోతకాలమున పంటనుగూర్చి వాడు విచారించునప్పుడు వానికేమియు లేకపోవును.

సామెతలు 22:13

సోమరి బయట సింహమున్నది వీధులలో నేను చంపబడుదుననును.

హగ్గయి 1:2

సమయమింక రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయమింక రాలేదని యీ జనులు చెప్పుచున్నారే.

మార్కు 4:26

మరియు ఆయన ఒక మనుష్యుడు భూమిలో విత్తనము చల్లి,

యోహాను 3:8

గాలి తన కిష్టమైన చోటను విసరును; నీవు దాని శబ్దము విందువేగాని అది యెక్కడనుండి వచ్చునో యెక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మమూలముగా జన్మించిన ప్రతివాడును ఆలాగే యున్నాడనెను.