ప్రసంగి 2: 16
క్రాస్-రిఫరెన్స్‌లు
" బుద్ధిహీనులను గూర్చినట్లుగానే జ్ఞానులను గూర్చియు జ్ఞాపకము ఎన్నటికిని యుంచబడదు; రాబోవు దినములలో వారందరును మరువబడినవారై యుందురు; జ్ఞానులు మృతినొందు విధమెట్టిదో బుద్ధిహీనులు మృతినొందు విధమట్టిదే."
సంబంధిత రిఫరెన్స్‌లు
యెరూషలేమునందు నాకు ముందున్న వారందరికంటెను నేను చాల ఎక్కువగా జ్ఞానము సంపాదించితిననియు, జ్ఞానమును విద్యను నేను పూర్ణముగా అభ్యసించితిననియు నా మనస్సులో నేననుకొంటిని.
విస్తారమైన జ్ఞానాభ్యాసముచేత విస్తారమైన దుఃఖము కలుగును; అధిక విద్య సంపాదించినవానికి అధిక శోకము కలుగును.
నీవు ఈలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను; బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను; పూర్వికులలో నీవంటివాడు ఒకడును లేడు, ఇకమీదట నీవంటివాడొకడును ఉండడు.
కానీ నిన్ను సంతోషముచేత శోధించి చూతును; నీవు మేలు ననుభవించి చూడుమని నేను నా హృదయముతో చెప్పుకొంటిని; అయితే అదియు వ్యర్థప్రయత్నమాయెను.
వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు, వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే.
సూర్యునిక్రింద జరుగుచున్న క్రియలనన్నిటిని నేను చూచితిని; అవి అన్నియు వ్యర్థములే, అవి యొకడు గాలికై ప్రయాసపడినట్టున్నవి.
మరియు రాజు అబ్నేరునుగూర్చి శోకకీర్తన యొకటి కట్టెను.
వివేచించుటకును పరిశోధించుటకును, జ్ఞానాభ్యాసము చేయుటకై సంగతులయొక్క హేతువులను తెలిసికొనుటకును, భక్తిహీనత బుద్ధిహీనత అనియు బుద్ధిహీనత వెఱ్ఱితనమనియు గ్రహించుటకును, రూఢి చేసికొని నా మనస్సు నిలిపితిని.
మరియు నేను ఆలోచింపగా సూర్యునిక్రింద జరుగుచున్నది నాకు తెలియబడెను. వడిగలవారు పరుగులో గెలువరు; బలము గలవారు యుద్ధమునందు విజయమొందరు; జ్ఞానము గలవారికి అన్నము దొరకదు; బుద్ధిమంతులగుటవలన ఐశ్వర్యము కలుగదు; తెలివి గలవారికి అనుగ్రహము దొరకదు; ఇవియన్నియు అదృష్టవశముచేతనే కాలవశముచేతనే అందరికి కలుగుచున్నవి.
ఒకడు చాలా సంవత్సరములు బ్రదికినయెడల చీకటిగల దినములు అనేకములు వచ్చునని యెరిగియుండి తాను బ్రదుకుదినములన్నియు సంతోషముగా ఉండవలెను, రాబోవునదంతయు వ్యర్థము.
ఓ మరణమా, నీ విజయమెక్కడ? ఓ మరణమా, నీ ముల్లెక్కడ?