లేఖనాలను అన్వేషించండి

ఎస్తేరు 4: 13

క్రాస్-రిఫరెన్స్‌లు

" మొర్దెకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరమిచ్చి రాజనగరులో ఉన్నంతమాత్రముచేత యూదులందరికంటె నీవు తప్పించుకొందువని నీ మనస్సులొ తలంచుకొనవద్దు;"

సంబంధిత రిఫరెన్స్‌లు

సామెతలు 24:10

శ్రమదినమున నీవు క్రుంగినయెడల నీవు చేతకానివాడవగుదువు.

సామెతలు 24:11

చావునకై పట్టబడినవారిని నీవు తప్పించుము నాశమునందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా?

సామెతలు 24:12

ఈ సంగతి మాకు తెలియదని నీవనుకొనినయెడల హృదయములను శోధించువాడు నీ మాటను గ్రహించును గదా. నిన్ను కనిపెట్టువాడు దాని నెరుగును గదా నరులకు వారి వారి పనులనుబట్టి ఆయన ప్రతికారము చేయును గదా.

మత్తయి 16:24

అప్పుడు యేసు తన శిష్యులను చూచి ఎవడైనను నన్ను వెంబడింపగోరినయెడల, తన్నుతాను ఉపేక్షించుకొని, తన సిలువనెత్తికొని నన్ను వెంబడింపవలెను.

మత్తయి 16:25

తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాని పోగొట్టుకొనును; నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాని దక్కించుకొనును.

యోహాను 12:25

తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్యజీవము కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

ఫిలిప్పీయులకు 2:30

గనుక పూర్ణానందముతో ప్రభువునందు అతనిని చేర్చుకొని అట్టివారిని ఘనపరచుడి.

హెబ్రీయులకు 12:3

మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు, పాపాత్ములు తనకు వ్యతిరేకముగ చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి.

ఎస్తేరు 2:10

మొర్దెకై నీ జాతిని నీ వంశమును కనుపరచకూడదని ఎస్తేరునకు ఆజ్ఞాపించి యుండెను గనుక ఆమె తెలుపలేదు.

సామెతలు 31:8

మూగవారికిని దిక్కులేని వారికందరికిని న్యాయము జరుగునట్లు నీ నోరు తెరువుము.

ప్రసంగి 3:7

చింపుటకు కుట్టుటకు; మౌనముగా నుండుటకు మాటలాడుటకు;