నిర్గమకాండము 10: 13
క్రాస్-రిఫరెన్స్‌లు
" మోషే ఐగుప్తు దేశముమీద తన కఱ్ఱను చాపగా యెహోవా ఆ పగలంతయు ఆ రాత్రి అంతయు ఆ దేశముమీద తూర్పుగాలిని విసరజేసెను; ఉదయమందు ఆ తూర్పుగాలికి మిడతలు వచ్చెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
మోషే సముద్రమువైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పుగాలిచేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను.
మరియు తూర్పు గాలిచేత చెడిపోయిన యేడు పీలవెన్నులు వాటి తరువాత మొలిచెను.
ఆకాశమందు తూర్పు గాలి ఆయన విసరజేసెను తన బలముచేత దక్షిణపు గాలి రప్పించెను.
ఆయన సెలవియ్యగా తుపాను పుట్టెను అది దాని తరంగములను పైకెత్తెను
వారు ఆకాశమువరకు ఎక్కుచు అగాధమునకు దిగుచునుండిరి శ్రమచేత వారి ప్రాణము కరిగిపోయెను.
మత్తులైన వారివలె వారు ముందుకు వెనుకకు దొర్లుచు ఇటు అటు తూలుచుండిరి వారు ఎటుతోచక యుండిరి.
శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొఱ్ఱపెట్టిరి ఆయన వారి ఆపదలలోనుండి వారిని విడిపించెను.
అగ్ని వడగండ్లారా, హిమమా, ఆవిరీ, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుపానూ,
అయితే యెహోవా సముద్రముమీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుపాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చెను.
మరియు ఎండకాయగా దేవుడు వేడిమిగల తూర్పుగాలిని రప్పించెను. యోనా తలకు ఎండదెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి బ్రదుకుటకంటె చచ్చుట నాకు మేలనుకొనెను.
ఆ మనుష్యులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడో; ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి.
నీవు అహరోనును చూచి నీ కఱ్ఱను పట్టుకొని ఫరో యెదుట దాని పడవేయుమనుము; అది సర్పమగును.
అప్పుడు యెహోవా గాలిని త్రిప్పి మహా బలమైన పడమటిగాలిని విసరజేయగా అది ఆ మిడతలను కొంచుపోయి ఎఱ్ఱసముద్రములో పడవేసెను. ఐగుప్తు సమస్త ప్రాంతములలో ఒక్క మిడతయైనను నిలువలేదు
తరువాత యెహోవా సన్నిధినుండి ఒక గాలి బయలుదేరి సముద్రమునుండి పూరేళ్లను రప్పించి పాళెముచుట్టు ఈ ప్రక్కను ఆ ప్రక్కను దినప్రయాణమంత దూరమువరకు భూమిమీద రెండు మూరల యెత్తున వాటిని పడజేసెను.
సాగిపోయిన నీడవలె నేను క్షీణించియున్నాను మిడతలను పారదోలునట్లు నన్ను పారదోలుదురు
మిడుతలకు రాజు లేడు అయినను అవన్నియు పంక్తులు తీరి సాగిపోవును.
ఆయన ఆజ్ఞ ఇయ్యగా జలరాసులు ఆకాశమండలములో పుట్టును. భూమ్యంతభాగములలోనుండి ఆయన ఆవిరి ఎక్కజేయును వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును తన ధనాగారములలోనుండి గాలిని రావించును.
అచ్చటనే అగ్ని నిన్ను కాల్చివేయును, ఖడ్గము నిన్ను నాశనము చేయును, గొంగళిపురుగు తినివేయు రీతిగా అది నిన్ను తినివేయును, నీవు సంఖ్యకు గొంగళి పురుగులంత విస్తారముగాను మిడుతలంత విస్తారముగాను ఉండుము.