నిర్గమకాండము 10: 19
క్రాస్-రిఫరెన్స్‌లు
" అప్పుడు యెహోవా గాలిని త్రిప్పి మహా బలమైన పడమటిగాలిని విసరజేయగా అది ఆ మిడతలను కొంచుపోయి ఎఱ్ఱసముద్రములో పడవేసెను. ఐగుప్తు సమస్త ప్రాంతములలో ఒక్క మిడతయైనను నిలువలేదు"
సంబంధిత రిఫరెన్స్‌లు
మోషే ఐగుప్తు దేశముమీద తన కఱ్ఱను చాపగా యెహోవా ఆ పగలంతయు ఆ రాత్రి అంతయు ఆ దేశముమీద తూర్పుగాలిని విసరజేసెను; ఉదయమందు ఆ తూర్పుగాలికి మిడతలు వచ్చెను.
అయితే దేవుడు ప్రజలను చుట్టుదారియగు ఎఱ్ఱ సముద్రపు అరణ్యమార్గమున నడిపించెను. ఇశ్రాయేలీయులు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులోనుండి వచ్చిరి.
ఆయన ఫరో రథములను అతని సేనను సముద్రములో పడద్రోసెను అతని అధిపతులలో శ్రేష్ఠులు ఎఱ్ఱ సముద్రములో మునిగిపోయిరి
మరియు ఉత్తరదిక్కునుండి వచ్చువాటిని మీకు దూరముగా పారదోలి, యెండిపోయిన నిష్ఫల భూమిలోనికి వాటిని తోలివేతును; అవి గొప్ప కార్యములు చేసెను గనుక వాటి ముందటి భాగమును తూర్పు సముద్రములోకిని, వెనుకటి భాగమును పడమటి సముద్రములోకిని పడగొట్టుదును; అక్కడ వాటి దుర్గంధము లేచును అవి కుళ్లువాసన కొట్టును.
విశ్వాసమునుబట్టి వారు పొడి నేలమీద నడిచినట్లు ఎఱ్ఱసముద్రములో బడి నడచిపోయిరి. ఐగుప్తీయులు ఆలాగు చేయజూచి మునిగిపోయిరి.
మోషే ఫరోను విడిచి ఆ పట్టణమునుండి బయలువెళ్లి యెహోవావైపు తనచేతులు ఎత్తినప్పుడు ఆ యురుములును వడగండ్లును నిలిచిపోయెను, వర్షము భూమిమీద కురియుట మానెను.
తరువాత యెహోవా సన్నిధినుండి ఒక గాలి బయలుదేరి సముద్రమునుండి పూరేళ్లను రప్పించి పాళెముచుట్టు ఈ ప్రక్కను ఆ ప్రక్కను దినప్రయాణమంత దూరమువరకు భూమిమీద రెండు మూరల యెత్తున వాటిని పడజేసెను.
సాగిపోయిన నీడవలె నేను క్షీణించియున్నాను మిడతలను పారదోలునట్లు నన్ను పారదోలుదురు
అగ్ని వడగండ్లారా, హిమమా, ఆవిరీ, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుపానూ,
ఆయన ఆజ్ఞ ఇయ్యగా జలరాసులు ఆకాశమండలములో పుట్టును. భూమ్యంతభాగములలోనుండి ఆయన ఆవిరి ఎక్కజేయును వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును తన ధనాగారములలోనుండి గాలిని రావించును.
అయితే యెహోవా సముద్రముమీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుపాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చెను.