లేఖనాలను అన్వేషించండి

నిర్గమకాండము 18: 3

క్రాస్-రిఫరెన్స్‌లు

" అతడు అన్యదేశములో నేను పరదేశిననుకొని వారిలో ఒకనికి గేర్షోము అని పేరు పెట్టెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

అపోస్తలులకార్యములు 7:29

మోషే ఆ మాట విని పారిపోయి మిద్యాను దేశములో పరదేశియైయుండి, అక్కడ ఇద్దరు కుమారులను కనెను.

నిర్గమకాండము 2:22

ఆమె ఒక కుమారుని కనినప్పుడు మోషే నేను అన్యదేశములో పరదేశినై యుంటిననుకొని వానికి గెర్షోము అను పేరు పెట్టెను.

కీర్తనలు 39:12

యెహోవా, నా ప్రార్థన ఆలంకిపుము నా మొఱ్ఱకు చెవియొగ్గుము నా కన్నీళ్లు చూచి మౌనముగా నుండకుము నీ దృష్టికి నేను అతిథివంటివాడను నా పితరులందరివలె నేను పరవాసినైయున్నాను

హెబ్రీయులకు 11:13

వీరందరు ఆ వాగ్దానముల ఫలము అనుభవింపక పోయినను, దూరమునుండి చూచి వందనము చేసి, తాము భూమిమీద పరదేశులమును యాత్రికులమునై యున్నామని ఒప్పకొని, విశ్వాసము గలవారై మృతినొందిరి.

1పేతురు 2:11

ప్రియులారా, మీరు పరదేశులును యాత్రికులునై యున్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి,

1దినవృత్తాంతములు 23:15

మోషే కుమారులు గెర్షోము ఎలీయెజెరు.