నిర్గమకాండము 19: 23
క్రాస్-రిఫరెన్స్‌లు
" మోషే యెహోవాతో ప్రజలు సీనాయి పర్వతము ఎక్కలేరు. నీవు పర్వతమునకు మేరలను ఏర్పరచి దాని పరిశుద్ధ పరచవలెనని మాకు ఖండితముగా ఆజ్ఞాపించితివనెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
నీవు చుట్టు ప్రజలకు మేరను ఏర్పరచి మీరు ఈ పర్వతము ఎక్కవద్దు, దాని అంచును ముట్టవద్దు, భద్రము సుమీ ఈ పర్వతము ముట్టు ప్రతివానికి మరణశిక్ష తప్పక విధింపబడవలెను.
మీకును దానికిని దాదాపు రెండువేలకొల మూరల యెడముండ వలెను. మీరు వెళ్లుత్రోవ మీరింతకుముందుగా వెళ్లినది కాదు, మీరు దానిని గురుతుపట్టవలెను గనుక ఆ మందసమునకు సమీపముగా మీరు నడవరాదు.
మరియు యెహోషువరేపు యెహోవా మీ మధ్య అద్భుతకార్య ములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచు కొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను.
దేవుని రథములు సహస్రములు సహస్ర సహస్రములు ప్రభువు వాటిలోనున్నాడు సీనాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమాయెను.