నిర్గమకాండము 22: 13
క్రాస్-రిఫరెన్స్‌లు
" అది నిజముగా చీల్చబడినయెడల వాడు సాక్ష్యముకొరకు దాని తేవలెను; చీల్చబడినదాని నష్టమును అచ్చుకొన నక్కరలేదు."
సంబంధిత రిఫరెన్స్‌లు
అందుకు అయ్యో, ప్రభువా, యెహోవా, నేనెన్నడును అపవిత్రత నొందినవాడను కానే, బాల్యమునుండి నేటివరకును చచ్చినదానినైనను మృగములు చీల్చినదానినైనను నేను తినినవాడను కానే, నిషిద్ధమైన మాంసము నా నోట ఎన్నడును పడలేదే అని నేననగా
యెహోవా సెలవిచ్చునదేమనగా గొల్లవాడు సింహము నోటనుండి రెండు కాళ్లనైనను చెవి ముక్కనైనను విడిపించునట్లుగా షోమ్రోనులో మంచములమీదను బుట్టాలువేసిన శయ్యలమీదను కూర్చుండు ఇశ్రాయేలీయులు రక్షింపబడుదురు.
యాకోబు సంతతిలో శేషించినవారు అన్యజనుల మధ్యను అనేక జనములలోను అడవిమృగములలో సింహమువలెను, ఎవడును విడిపింపకుండ లోపలికి చొచ్చి గొఱ్ఱల మందలను త్రొక్కి చీల్చు కొదమసింహమువలెను ఉందురు.
తన పిల్లలకు కావలసినంత చీల్చివేయుచు, ఆడుసింహములకును కావలసినంత గొంతుక నొక్కిపట్టుచు, తన గుహలను ఎరతోను తన నివాసములను వేటాడిపట్టిన యెరతోను నింపిన సింహమేమాయెను?
ఇదే సైన్యములకధిపతియగు యెహోవా వాక్కు ఆ దినమున విగ్రహముల పేళ్లు ఇకను జ్ఞాపకము రాకుండ దేశములోనుండి నేను వాటిని కొట్టివేతును; మరియు ప్రవక్తలను అపవిత్రాత్మను దేశములో లేకుండచేతును.