లేఖనాలను అన్వేషించండి

యెహెజ్కేలు 12: 6

క్రాస్-రిఫరెన్స్‌లు

" వారు చూచుచుండగా రాత్రియందు మూట భుజముమీద పెట్టుకొని నేల కనబడకుండ నీ ముఖము కప్పుకొని దానిని కొనిపొమ్ము, నేను ఇశ్రాయేలీయులకు నిన్ను సూచనగా నిర్ణయించితిని."

సంబంధిత రిఫరెన్స్‌లు

2రాజులు 25:4

కల్దీయులు పట్టణ ప్రాకారమును పడగొట్టగా సైనికులు రాత్రియందు రాజు తోటదగ్గర రెండు గోడల మధ్యనున్న ద్వారపు మార్గమున పారిపోయిరి.

యిర్మియా 39:2

సిద్కియా యేలుబడియందు పదకొండవ సంవత్సరము నాలుగవ నెల తొమ్మిదవ దినమున పట్టణ ప్రాకారములు పడగొట్టబడెను.

యిర్మియా 39:3

యెరూషలేము పట్టబడగా అధిపతులందరు, నేర్గల్‌షరేజరు సవ్గుర్నెబో షండులకధిపతియగు శర్సెకీము, జ్ఞానులకధిపతియగు నేర్గల్‌షరేజరు మొదలైన బబులోను రాజు అధిపతులందరు లోపలికి వచ్చి మధ్యగుమ్మములో కూర్చుండిరి.

యిర్మియా 39:4

యూదుల రాజైన సిద్కియాయు అతని యోధులందరును వారినిచూచి పారిపోయి, రాజు తోటమార్గమున రెండు గోడల మధ్యనున్న గుమ్మపుమార్గమున పోయిరి గాని రాజు మైదానపు మార్గమున వెళ్లిపోయెను.

యోబు 24:16

చీకటిలో వారు కన్నము వేయుదురు పగలు దాగుకొందురు వారు వెలుగు చూడనొల్లరు

ఆమోసు 4:3

ఇటు అటు తొలగకుండ మీరందరు ప్రాకారపు గండ్లద్వారా పోవుదురు, హర్మోను మార్గమున వెలివేయబడుదురు; ఇదే యెహోవా వాక్కు.