లేఖనాలను అన్వేషించండి

యెహెజ్కేలు 24: 11

క్రాస్-రిఫరెన్స్‌లు

" తరువాత దానికి తగిలిన మష్టును మడ్డియు పోవునట్లు అది వేడియై మెరుగు పట్టువరకు వట్టిచట్టి పొయ్యిమీదనే యుంచుము."

సంబంధిత రిఫరెన్స్‌లు

యిర్మియా 17:3

పొలములోనున్న నా పర్వతమా, నీ ప్రాంతములన్నిటిలో నీవు చేయు నీ పాపమునుబట్టి నీ ఆస్తిని నీ నిధులన్నిటిని నీ బలిపీఠములను దోపుడుసొమ్ముగా నేనప్పగించుచున్నాను.

యిర్మియా 20:5

ఈ పట్టణములోని ఐశ్వర్యమంతయు దానికి వచ్చిన లాభమంతయు దాని అమూల్య వస్తువులన్నియు యూదా రాజుల నిధులన్నియు నేనప్పగింతును, వారి శత్రువులచేతికే వాటి నప్పగింతును, శత్రువులు వాటిని దోచుకొని పట్టుకొని బబులోనునకు తీసికొనిపోవుదురు.

విలాపవాక్యములు 1:10

దాని మనోహరమైన వస్తువులన్నియు శత్రువులచేతిలో చిక్కెను నీ సమాజములో ప్రవేశింపకూడదని యెవరినిగూర్చి ఆజ్ఞాపించితివో ఆ జనములవారు దాని పరిశుద్ధస్థలమున ప్రవేశించియుండుట అది చూచుచునేయున్నది

విలాపవాక్యములు 2:16

నీ శత్రువులందరు నిన్నుచూచి నోరుతెరచెదరు వారు ఎగతాళిచేసి పండ్లుకొరుకుచు దాని మింగివేసియున్నాము ఇదేగదా మనము కనిపెట్టిన దినము అది తటస్థించెను, దాని మనము చూచియున్నాము అని యనుకొనెదరు.

2రాజులు 21:13

నేను షోమ్రోనును కొలిచిన నూలును, అహాబు కుటుంబికులను సరిచూచిన మట్టపు గుండును యెరూషలేముమీద సాగలాగుదును; ఒకడు పళ్లెమును తుడుచునప్పుడు దాని బోర్లించి తుడుచునట్లు నేను యెరూషలేమును తుడిచివేసెదను.

యెహెజ్కేలు 24:5

మందలో శ్రేష్ఠమైనవాటిని తీసికొనుము, అందున్న యెముకలు ఉడుకునట్లు చాల కట్టెలు పోగుచేయుము, దానిని బాగుగా పొంగించుము, ఎముకలను చాలునంతగా ఉడికించుము.