యెహెజ్కేలు 28: 23
క్రాస్-రిఫరెన్స్‌లు
" నేను యెహోవానని వారు తెలిసికొనునట్లు తెగులును రక్తమును దాని వీధులలోనికి పంపించుదును, నలుదిక్కుల దానిమీదికి వచ్చు ఖడ్గముచేత వారు హతులగుదురు, నేను ప్రభువగు యెహోవానని"
సంబంధిత రిఫరెన్స్‌లు
కావున ప్రభువైన యెహోవానగు నేను నీకు విరోధినైతిని, అన్యజనులు చూచుచుండగా నీకు శిక్ష విధింతును.
యెహోవా సెలవిచ్చునదేమనగా నేను నీకు విరోధినైతిని. నీతిపరులనేమి దుష్టులనేమి నీలో ఎవరు నుండకుండ అందరిని నిర్మూలము చేయుటకై నా ఖడ్గము ఒరదూసి యున్నాను.
ప్రభువైన యెహోవా సెలవిచ్చున దేమనగా తూరు పట్టణమా, నేను నీకు విరోధినైతిని, సముద్రము దాని తరంగములను పొంగజేయు రీతిగా నేను అనేకజనములను నీ మీదికి రప్పించెదను.
ఐగుప్తు రాజైన ఫరో, నైలునదిలో పండుకొనియున్న పెద్దమొసలీ, నేను నీకు విరోధిని; నైలునది నాది, నేనే దాని కలుగజేసితిని అని నీవు చెప్పుకొనుచున్నావే;
నేను నీకును నీ నదికిని విరోధినైతిని, ఐగుప్తు దేశమును మిగ్దోలు మొదలుకొని సెవేనేవరకు కూషు సరిహద్దువరకు బొత్తిగా పాడుచేసి యెడారిగా ఉంచెదను.
ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా రోషునకును మెషెకునకును తుబాలునకును అధిపతియగు గోగూ, నేను నీకు విరోధినైయున్నాను.
మరియు నరపుత్రుడా, గోగునుగూర్చి ప్రవచనమెత్తి ఇట్లనుము ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా రోషునకును మెషెకునకును తుబాలునకును అధిపతివైన గోగూ, నేను నీకు విరోధినైయున్నాను.
నిన్ను వెనుకకు త్రిప్పి నడిపించి, ఉత్తరదిక్కున దూరములో ఉన్న నిన్ను బయలుదేరదీసి ఇశ్రాయేలీయుల పర్వతములకు రప్పించి
నీ యెడమచేతిలోనున్న నీ వింటిని క్రింద పడగొట్టెదను, నీ కుడిచేతిలోనున్న బాణములను క్రింద పడవేసెదను,
యెహోవా వాక్కు ఇదే లోయలో నివసించుదానా, మైదానమందలి బండవంటిదానా, మా మీదికి రాగలవాడెవడు, మా నివాసస్థలములలో ప్రవేశించువాడెవడు? అనుకొనువారలారా,
ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా వాక్కు ఇదే గర్విష్ఠుడా, నేను నీకు విరోధినైయున్నాను నీ దినము వచ్చుచున్నది నేను నిన్ను శిక్షించుకాలము వచ్చుచున్నది
ఆయన ఉగ్రతను సహింపగలవాడెవడు? ఆయన కోపాగ్ని యెదుట నిలువగలవాడెవడు? ఆయన కోపము అగ్నివలె పారును, ఆయన కొండలను కొట్టగా అవి బద్దలగును.
నేను నీకు విరోధినై యున్నాను, వాటి పొగ పైకెక్కునట్లుగా నీ రథములను కాల్చివేసెదను, కత్తి నీ కొదమసింహములను మింగివేయును, నీకిక దొరకకుండ భూమిలోనుండి నీవు పట్టుకొనిన యెరను నేను తీసివేతును, నీ దూతల శబ్దము ఇక వినబడదు; ఇదే సైన్యములకధిపతియగు యెహోవా వాక్కు.
నీవు చేసిన అధిక జారత్వమునుబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు ఇదే నేను నీకు విరోధినైయున్నాను, నీచెంగులు నీ ముఖము మీదికెత్తి జనములకు నీ మానమును రాజ్యములకు నీ యవమానమును నేను బయలుపరతును.
ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా జనులలో చెదిరిపోయిన ఇశ్రాయేలీయులను నేను సమకూర్చి, జనుల సమక్షమున వారి మధ్యను నన్ను నేను పరిశుద్ధపరచుకొందును, అప్పుడు నా సేవకుడైన యాకోబునకు నేనిచ్చిన తమ దేశములో వారు నివసించెదరు.
నేను ఘనము వహించు దినమున దేశపు జనులందరు వారిని పాతిపెట్టుదురు; దానివలన వారు కీర్తి నొందెదరు; ఇదే యెహోవా వాక్కు.
నా బలమును నీకు చూపునట్లును, భూలోకమందంతట నా నామమును ప్రచురము చేయునట్లును ఇందుకే నేను నిన్ను నియమించితిని.
అయితే నేను ఫరో హృదయమును కఠిన పరచెదను; అతడు వారిని తరుమగా; నేను ఫరోవలనను అతని సమస్త సేన వలనను మహిమ తెచ్చుకొందును; నేను యెహోవానని ఐగుప్తీయులందరు తెలిసికొందురనెను. వారు ఆలాగు దిగిరి
ఇదిగో నేను నేనే ఐగుప్తీయుల హృదయములను కఠిన పరుచుదును. వారు వీరిని తరుముదురు; నేను ఫరోవలనను అతని సమస్త సేన వలనను అతని రథముల వలనను అతని గుఱ్ఱపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకొందును.
మిర్యాము వారితో కలిసి యిట్లు పల్లవి యెత్తి పాడెను యెహోవాను గానము చేయుడి ఆయన మిగుల అతిశయించి జయించెను గుఱ్ఱమును దాని రౌతును సముద్రములో ఆయన పడద్రోసెను.
అప్పుడు మోషే అహరోనుతో ఇట్లనెను ఇది యెహోవా చెప్పిన మాట నాయొద్దనుండు వారియందు నేను నన్ను పరిశుద్ధపరచుకొందును; ప్రజలందరియెదుట నన్ను మహిమపరచుకొందును;
దావీదు నీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకధిపతియగు యెహోవా పేరట నేను నీమీదికి వచ్చుచున్నాను.
ఈ దినమున యెహోవా నిన్ను నాచేతికి అప్పగించును; నేను నిన్ను చంపి నీ తల తెగవేతును; ఇశ్రాయేలీయులలో దేవుడున్నాడని లోక నివాసులందరును తెలిసికొనునట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయులయొక్క కళేబరములను ఆకాశపక్షులకును భూమృగములకును ఇత్తును.
అప్పుడు యెహోవా కత్తిచేతను ఈటెచేతను రక్షించువాడు కాడని యీ దండువారందరు తెలిసికొందురు; యుద్ధము యెహోవాదే; ఆయన మిమ్మును మాచేతికి అప్పగించునని చెప్పెను.
యెహోవా ప్రత్యక్షమాయెను, ఆయన తీర్పు తీర్చియున్నాడు. దుష్టులు తాము చేసికొనినదానిలో చిక్కియున్నారు(హిగ్గాయోన్ సెలా.)
నీవు వారిని వెనుకకు త్రిప్పివేసెదవు నీ వింటి నారులను బిగించి వారిని ముఖముమీద కొట్టుదువు.
యెహోవా, నీ బలమునుబట్టి నిన్ను హెచ్చించుకొనుము మేము గానము చేయుచు నీ పరాక్రమమును కీర్తించెదము.
వారు నిత్యము సిగ్గుపడి భీతి నొందుదురు గాక వారు భ్రమసి నశించుదురు గాక.
అల్పులు అణగద్రొక్కబడుదురు ఘనులు తగ్గింపబడుదురు గర్విష్ఠుల చూపు తగ్గును
సైన్యములకధిపతియగు యెహోవాయే తీర్పు తీర్చి మహిమపరచబడును పరిశుద్ధుడైన దేవుడు నీతినిబట్టి తన్ను పరిశుద్ధ పరచుకొనును.
యెహోవా, లోకమందున్న నీవే నిజముగా నీవే అద్వితీయ దేవుడవైన యెహోవావని సమస్త జనులు తెలిసికొనునట్లు అతని చేతిలోనుండి మమ్మును రక్షించుము.
అటుతరువాత బహు జనుల శబ్దమువంటి గొప్ప స్వరము పరలోకమందు ఈలాగు చెప్పగా వింటిని ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును;
ఆయన తీర్పులు సత్యములును న్యాయములునై యున్నవి; తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమునుబట్టి దానికి ప్రతిదండన చేసెను; మరి రెండవసారి వారు ప్రభువును స్తుతించుడి అనిరి.
జనములలోనుండి నేను మిమ్మును రప్పించునప్పుడును, మిమ్మును చెదరగొట్టిన ఆ యా దేశములలోనుండి మిమ్మును సమకూర్చునప్పుడును, పరిమళధూపముగా మిమ్మును అంగీకరించెదను, అన్యజనులయెదుటను మీ మధ్యను నన్ను నేను పరిశుద్ధపరచుకొందును.
అన్యజనుల మధ్య మీరు దూషించిన నా ఘనమైన నామమును నేను పరిశుద్ధ పరచుదును, వారి యెదుట మీయందు నేను నన్ను పరిశుద్ధ పరచుకొనగా నేను ప్రభువగు యెహోవానని వారు తెలిసికొందురు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
నేను యెహోవానై యున్నానని అన్యజనులు అనేకులు తెలిసికొనునట్లు నేను ఘనత వహించి నన్ను పరిశుద్ధపరచుకొని వారియెదుట నన్ను తెలియపరచుకొందును.
నేను ఐగుప్తుమీద నా చెయ్యి చాపి ఇశ్రాయేలీయులను వారి మధ్యనుండి రప్పింపగానే నేను యెహోవానని ఐగుప్తీయులు తెలిసికొందురనెను.
తూరు రాజులందరును సీదోను రాజులందరును సముద్రమునకు ఆవలి ద్వీపపు రాజులును
కావున ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు మీరు వ్యర్థమైన మాటలు పలుకుచు నిరర్థకమైన దర్శనములు కనుచున్నారు గనుక నేను మీకు విరోధిని; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
వారు అందులో నిర్ఛయముగా నివసించి యిండ్లు కట్టుకొని ద్రాక్షతోటలు నాటుకొందురు, వారి చుట్టు ఉండి వారిని తిరస్కరించుచు వచ్చినవారికందరికి నేను శిక్షవిధించిన తరువాత వారు నిర్భయముగా నివసించు కాలమున నేను తమ దేవుడైన యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు.
నరపుత్రుడా, నీ ముఖమును ఐగుప్తు రాజైన ఫరోవైపు త్రిప్పుకొని అతనిగూర్చియు ఐగుప్తు దేశమంతటినిగూర్చియు ఈ సమాచారమెత్తి ప్రవచింపుము ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా
అప్పుడు నేను యెహోవానై యున్నానని ఐగుప్తీయులందరు తెలిసికొందరు. ఐగుప్తు ఇశ్రాయేలీయులకు రెల్లుపుల్లవంటి చేతికఱ్ఱ ఆయెను;
ఇశ్రాయేలీయులు తాము చేసిన దోషము మనస్సునకు తెచ్చుకొని వారితట్టు తిరిగినయెడల ఐగుప్తీయులు ఇక వారికి ఆధారముగా ఉండరు, అప్పుడు నేను ప్రభువైన యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు.
చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీమీద మాంసము పొదిగి చర్మము మీమీద కప్పెదను; మీలో జీవాత్మనుంచగా మీరు బ్రదుకుదురు; అప్పుడు నేను యెహోవానై యున్నానని మీరు తెలిసికొందురు.
ఆయన అక్కడనుండి లేచి, తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్లి, యొక ఇంట ప్రవేశించి, ఆ సంగతి ఎవనికిని తెలియకుండవలెనని కోరెను గాని ఆయన మరుగై యుండలేకపోయెను.