లేఖనాలను అన్వేషించండి

యెహెజ్కేలు 3: 12

క్రాస్-రిఫరెన్స్‌లు

" అంతలో ఆత్మ నన్నెత్తికొనిపోగా యెహోవా ప్రభావమునకు స్తోత్రము కలుగునుగాక అను శబ్దమొకటి ఆయన యున్న స్థలమునుండి ఆర్భాటముతో నా వెనుక పలుకుట నేను వింటిని."

సంబంధిత రిఫరెన్స్‌లు

యెహెజ్కేలు 3:15

నేను కెబారు నది దగ్గర తేలాబీబు అను స్థలమందు కాపురముండు చెరపట్టబడినవారియొద్దకు వచ్చి, వారు కూర్చున్న స్థలమందు కూర్చుండి యేమియు చెప్పకయు కదలకయు నున్నవాడనై యేడు దినములు వారి మధ్య నుంటిని.

యెహెజ్కేలు 11:24

తరువాత ఆత్మ నన్ను ఎత్తి, నేను దైవాత్మవశుడను కాగా, దర్శనములో నైనట్టు కల్దీయులదేశమునందు చెరలో ఉన్నవారియొద్దకు నన్ను దింపెను. అంతలో నాకు కనబడిన దర్శనము కనబడకుండ పైకెక్కెను.

యెహెజ్కేలు 11:25

అప్పుడు యెహోవా నాకు ప్రత్యక్షపరచిన వాటినన్నిటిని చెరలో ఉన్నవారికి నేను తెలియజేసితిని.

దానియేలు 6:13

అందుకు వారు చెరపట్టబడిన యూదులలో నున్న ఆ దానియేలు, నిన్నేగాని నీవు పుట్టించిన శాసనమునేగాని లక్ష్యపెట్టక, అనుదినము ముమ్మారు ప్రార్థన చేయుచు వచ్చుచున్నాడనిరి.

యెహెజ్కేలు 33:2

నరపుత్రుడా, నీవు నీ జనులకు సమాచారము ప్రకటించి వారితో ఇట్లనుము నేను ఒకానొక దేశముమీదికి ఖడ్గమును రప్పింపగా ఆ జనులు తమలో ఒకనిని ఏర్పరచుకొని కావలిగా నిర్ణయించినయెడల

యెహెజ్కేలు 33:12

మరియు నరపుత్రుడా, నీవు నీ జనులకు ఈ మాట తెలియజేయుము నీతిమంతుడు పాపము చేసిన దినమున అదివరకు అతడు అనుసరించిన నీతి అతని విడిపింపదు. దుష్టుడు చెడుతనము విడిచి మనస్సు త్రిప్పుకొనిన దినమున తాను చేసియున్న చెడుతనమునుబట్టి వాడు పడిపోడు, ఆలాగుననే నీతిమంతుడు పాపముచేసిన దినమున తన నీతినిబట్టి అతడు బ్రదుకజాలడు.

యెహెజ్కేలు 33:17

అయినను నీ జనులు యెహోవా మార్గము న్యాయము కాదని యనుకొందురు; అయితే వారి ప్రవర్తనయే గదా అన్యాయమైనది?

యెహెజ్కేలు 33:30

మరియు నరపుత్రుడా; నీ జనుల గోడదగ్గరను ఇంటి ద్వారములందును నిలువబడి నిన్నుగూర్చి మాటలాడుదురు, ఒకరినొకరు చూచిపోదము రండి, యెహోవా యొద్దనుండి బయలుదేరు మాట యెట్టిదో చూతము రండి అని చెప్పుకొనుచున్నారు.

యెహెజ్కేలు 37:18

ఇందులకు తాత్పర్యము మాకు తెలియజెప్పవా? అని నీ జనులు నిన్నడుగగా

నిర్గమకాండము 32:7

కాగా యెహోవా మోషేతో ఇట్లనెను నీవు దిగివెళ్లుము; ఐగుప్తు దేశమునుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి.

ద్వితియోపదేశాకాండము 9:12

నీవు లేచి యిక్కడనుండి త్వరగా దిగుము; నీవు ఐగుప్తులోనుండి రప్పించిన నీ జనము చెడిపోయి, నేను వారికాజ్ఞాపించిన త్రోవలోనుండి త్వరగా తొలగి తమకు పోతబొమ్మను చేసికొనిరని నాతో చెప్పెను.

దానియేలు 12:1

ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచునట్టి మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని యీ కాలము వరకు ఎన్నటికిని కలుగనంత ఆపద కలుగును; అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైనవారెవరో వారు తప్పించుకొందురు.

యెహెజ్కేలు 3:27

అయితే నేను నీతో మాటలాడి నీ నోరు తెరచెదను, వారు తిరుగుబాటు చేయువారు గనుక నీవు వారియొద్దకు పోయి వినువాడు వినునుగాక విననొల్లనివాడు విననొల్లకయుండును గాక అని ప్రభువగు యెహోవా సెలవిచ్చుచున్నాడని వారితో చెప్పవలెను.

యెహెజ్కేలు 2:5

గనుక వారు వినినను వినకపోయినను తమ మధ్య ప్రవక్తయున్నాడని వారు తెలిసికొనునట్లు ప్రభువగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడని నీవు వారికి ప్రకటింపవలెను.

యెహెజ్కేలు 2:7

అయినను ఆ జనులకు భయపడకుము, వారి మాటలకును భయపడకుము. వారు తిరుగుబాటు చేయువారు వారికి భయపడకుము.

అపోస్తలులకార్యములు 20:26

కాబట్టి మీలో ఎవరి నాశనము విషయమైనను నేను దోషిని కానని నేడు మిమ్మును సాక్ష్యము పెట్టుచున్నాను.

అపోస్తలులకార్యములు 20:27

దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండ నేనేమియు దాచుకొనలేదు.

నిర్గమకాండము 6:29

యెహోవా నేను యెహోవాను; నేను నీతో చెప్పునది యావత్తు నీవు ఐగుప్తు రాజైన ఫరోతో పలుకుమని మోషేతో చెప్పగా

యిర్మియా 1:17

కాబట్టి నీవు నడుముకట్టుకొని నిలువబడి నేను నీకాజ్ఞాపించునదంతయు వారికి ప్రకటన చేయుము; భయపడకుము లేదా నేను వారి యెదుట నీకు భయము పుట్టింతును.

యిర్మియా 15:19

కాబట్టి యెహోవా ఈలాగు సెలవిచ్చెను నీవు నాతట్టు తిరిగినయెడల నీవు నా సన్నిధిని నిలుచునట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో యేవి ఘనములో నీవు గురుతుపట్టినయెడల నీవు నా నోటివలె ఉందువు; వారు నీతట్టునకు తిరుగవలెను గాని నీవు వారి తట్టునకు తిరుగకూడదు

యిర్మియా 19:2

నీవు వెళ్లి కుమ్మరి చేయు మంటి కూజాను కొని, జనుల పెద్దలలో కొందరిని యాజకుల పెద్దలలో కొందరిని పిలుచుకొనిపోయి, హర్సీతు గుమ్మపు ద్వారమునకు ఎదురుగా నున్న బెన్‌హిన్నోము లోయలోనికిపోయి నేను నీతో చెప్పబోవు మాటలు అక్కడ ప్రకటింపుము.

యిర్మియా 29:20

నేను యెరూషలేములోనుండి బబులోనునకు చెరగొనిపోయిన వారలారా, మీరందరు యెహోవా ఆజ్ఞను ఆలకించుడి.

యెహెజ్కేలు 3:4

మరియు ఆయన నాతో ఈలాగు సెలవిచ్చెను నరపుత్రుడా, నీవు బయలుదేరి ఇశ్రాయేలీయులయొద్దకు పోయి నా మాటలు వారికి తెలియజెప్పుము.

యెహెజ్కేలు 11:5

అంతట యెహోవా ఆత్మ నామీదికి వచ్చి ఆజ్ఞ ఇచ్చినదేమనగా నీవు నీ మాట వారికి తెలియజేయుము, యెహోవా సెలవిచ్చిన మాట యిదే ఇశ్రాయేలీయులారా, మీరీలాగున పలుకుచున్నారే, మీ మనస్సున పుట్టిన అభిప్రాయములు నాకు తెలిసేయున్నవి.

యెహెజ్కేలు 20:27

కాబట్టి నరపుత్రుడా, ఇశ్రాయేలీయులతో మాటలాడి ఇట్లు ప్రకటింపుము ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా మీ పితరులు నాయెడల అతిక్రమముచేసి నన్ను దూషించి

మత్తయి 11:14

ఈ సంగతి నంగీకరించుటకు మీకు మనస్సుంటే రాబోవు ఏలీయా యితడే.

అపోస్తలులకార్యములు 2:4

అందరు పరిశుద్ధాత్మతో నిండినవారై ఆ ఆత్మ వారికి వాక్‌శక్తి అనుగ్రహించినకొలది అన్యభాషలతో మాటలాడసాగిరి.

అపోస్తలులకార్యములు 4:20

మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక యుండలేమని వారికి ఉత్తరమిచ్చిరి;