యెహెజ్కేలు 44: 18
క్రాస్-రిఫరెన్స్‌లు
" అవిసెనార పాగాలు ధరించుకొని నడుములకు జనుపనారబట్ట కట్టుకొనవలెను, చెమట పుట్టించునదేదైనను వారు ధరింపకూడదు."
సంబంధిత రిఫరెన్స్‌లు
మరియు సన్ననారతో చొక్కాయిని బుట్టాపనిగా చేయవలెను. సన్ననారతో పాగాను నేయవలెను; దట్టిని బుట్టాపనిగా చేయవలెను.
అహరోను కుమారులకు నీవు చొక్కాయిలను కుట్టవలెను; వారికి దట్టీలను చేయవలెను; వారికి అలంకారమును ఘనతయు కలుగునట్లు కుళ్లాయిలను వారికి చేయవలెను.
వారు ప్రత్యక్షపు గుడారములోనికి ప్రవేశించునప్పుడైనను, పరిశుద్ధస్థలములో సేవచేయుటకు బలిపీఠమును సమీపించునప్పుడైనను, వారు దోషులై చావక యుండునట్లు అది అహరోనుమీదను అతని కుమారులమీదను ఉండవలెను. ఇది అతనికిని అతని తరువాత అతని సంతతికిని నిత్యమైన కట్టడ.
మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు అహరోనుకును అతని కుమారులకును నేత పనియైన సన్ననార చొక్కాయిలను సన్ననార పాగాను అందమైన
సన్ననార కుళ్లాయిలను పేనిన సన్ననార లాగులను
నీల ధూమ్ర రక్తవర్ణములు గల పేనిన సన్ననారతో బుటాపనియైన నడికట్టును చేసిరి.
అతడు ప్రతిష్ఠితమైన చొక్కాయి తొడుగుకొని తన మానమునకు సన్ననార లాగులు తొడుగుకొని, సన్ననార దట్టి కట్టుకొని సన్ననార పాగా పెట్టుకొనవలెను. అవి ప్రతిష్ఠ వస్త్రములు గనుక అతడు నీళ్లతో దేహము కడుగుకొని వాటిని వేసికొనవలెను.
సింహాసనము చుట్టు ఇరువది నాలుగు సింహాసనములుండెను, ఈ సింహాసనములందు ఇరువది నలుగురు పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని, తమ తలలమీద సువర్ణ కిరీటములు పెట్టుకొన్నవారై కూర్చుండిరి.
మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములును నిర్మలములు నైన సన్నపు నారబట్టలు ఆమెకియ్యబడెను; అవి పరిశుద్ధుల నీతిక్రియలు.
యాజకుడు తన సన్ననార నిలువుటంగీని తొడుగుకొని తన మానమునకు తన నారలాగును తొడుగుకొని బలిపీఠముమీద అగ్ని దహించు దహనబలి ద్రవ్యపు బూడిదెను ఎత్తి బలిపీఠమునొద్ద దానిని పోసి
పరిశుద్ధస్థలములో పరిచర్య చేయుటకై లోపటి ఆవరణములోని పరిశుద్ధస్థలమునకు వచ్చినవాడు అతడు తనకొరకు పాపపరిహారార్థబలి అర్పింపవలెను; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
ఏడు తెగుళ్లుచేత పట్టుకొనియున్న ఆ యేడుగురు దూతలు, నిర్మలమును ప్రకాశమానమునైన రాతిని ధరించుకొని, రొమ్ములమీద బంగారు దట్టీలు కట్టుకొనినవారై ఆ ఆలయములోనుండి వెలుపలికి వచ్చిరి.