లేఖనాలను అన్వేషించండి

ఆదికాండము 1: 15

క్రాస్-రిఫరెన్స్‌లు

" భూమిమీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై యుండుగాకనియు పలికెను; ఆ ప్రకారమాయెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

ఆదికాండము 1:7

దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారమాయెను.

యోబు 41:32

అది తాను నడచిన త్రోవను తన వెనుక ప్రకాశింపజేయును చూచినవారికి సముద్రము నెరసిన వెండ్రుకలుగా తోచును.

కీర్తనలు 19:1

ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతిపనిని ప్రచురపరచుచున్నది.

2కొరిందీయులకు 4:6

గనుక మేము మమ్మునుగూర్చి ప్రకటించుకొనుటలేదు గాని, క్రీస్తుయేసునుగూర్చి ఆయన ప్రభువనియు, మమ్మునుగూర్చి, యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము.

యాకోబు 1:17

శ్రేష్ఠమైన ప్రతి యీవియు సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైనదై, జ్యోతిర్మయుడగు తండ్రియొద్దనుండి వచ్చును; ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనములవలన కలుగు ఏ ఛాయయైనను లేదు.