లేఖనాలను అన్వేషించండి

ఆదికాండము 2: 21

క్రాస్-రిఫరెన్స్‌లు

" అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢనిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

ఆదికాండము 15:12

ప్రొద్దు గ్రుంకబోయినప్పుడు అబ్రామునకు గాఢనిద్ర పట్టెను. భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా

1సమూయేలు 26:12

సౌలు తలగడ దగ్గరనున్న యీటెను నీళ్లబుడ్డిని తీసికొని వారిద్దరు వెళ్లిపోయిరి. యెహోవా చేత వారికందరికి గాఢనిద్ర కలుగగా వారిలో ఎవడును నిద్ర మేలుకొనలేదు, ఎవడును వచ్చినవారిని చూడలేదు, జరిగినదాని గుర్తుపట్టిన వాడొకడును లేడు.

యోబు 4:13

గాఢనిద్ర మనుష్యులకు వచ్చు సమయమున రాత్రి కలలవలన పుట్టు తలంపులలో అది కలిగెను.

యోబు 33:15

మంచముమీద కునుకు సమయమున గాఢనిద్ర పట్టునప్పుడు కలలో రాత్రి కలుగు స్వప్నములలో

సామెతలు 19:15

సోమరితనము గాఢనిద్రలో పడవేయును సోమరివాడు పస్తు పడియుండును.

దానియేలు 8:18

అతడు నాతో మాటలాడుచుండగా నేను గాఢనిద్ర పట్టినవాడనై నేలను సాష్టాంగపడితిని గనుక అతడు నన్ను పట్టుకొని లేవనెత్తి నిలువబెట్టెను.

ఆదికాండము 1:27

దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను; స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను.

దానియేలు 10:9

నేను అతని మాటలు వింటిని; అతని మాటలు విని నేను నేలను సాష్టాంగపడి గాఢనిద్ర పొందినవాడనైతిని.

మత్తయి 19:5

ఇందు నిమిత్తము పురుషుడు తలిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏకశరీరముగా ఉందురని చెప్పెననియు మీరు చదువలేదా?

1కొరిందీయులకు 11:8

ఏలయనగా స్త్రీ పురుషునినుండి కలిగెనే గాని పురుషుడు స్త్రీనుండి కలుగలేదు.

ఎఫెసీయులకు 5:28

అటువలెనే పురుషులు కూడ తమ సొంత శరీరములనువలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై యున్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు.

హెబ్రీయులకు 13:4

వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను, పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను; వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును.