లేఖనాలను అన్వేషించండి

ఆదికాండము 28: 5

క్రాస్-రిఫరెన్స్‌లు

" యాకోబును పంపివేసెను. అతడు పద్దనరాములోనున్న సిరియావాడగు బెతూయేలు కుమారుడును, యాకోబు ఏశావుల తల్లియగు రిబ్కా సహోదరుడునైన లాబానునొద్దకు వెళ్లెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

ఆదికాండము 28:2

నీవు లేచి పద్దనరాములోనున్న నీ తల్లికి తండ్రియైన బెతూయేలు ఇంటికి వెళ్లి అక్కడ నీ తల్లి సహోదరుడగు లాబాను కుమార్తెలలో ఒకదానిని వివాహము చేసికొనుమని యతనికి ఆజ్ఞాపించి

ఆదికాండము 22:23

ఆ యెనిమిదిమందిని మిల్కా అబ్రాహాము సహోదరుడగు నాహోరునకు కనెను.

ఆదికాండము 24:54

అతడును అతనితోకూడ నున్న మనుష్యులును అన్నపానములు పుచ్చుకొని అక్కడ ఆ రాత్రియంతయు నుండిరి. ఉదయమున వారు లేచినప్పుడు అతడు నా యజమానునియొద్దకు నన్ను పంపించుడని చెప్పగా

ఆదికాండము 25:20

ఇస్సాకు పద్దనరాములో నివసించు సిరియావాడైన బెతూయేలు కుమార్తెయును సిరియావాడైన లాబాను సహోదరియునైన రిబ్కాను పెండ్లి చేసికొన్నప్పుడు నలుబది సంవత్సరములవాడు.

ఆదికాండము 29:1

యాకోబు బయలుదేరి తూర్పు జనుల దేశమునకు వెళ్లెను.

ఆదికాండము 31:24

ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియావాడైన లాబాను నొద్దకు వచ్చి నీవు యాకోబుతో మంచి గాని చెడ్డ గాని పలుకకుము జాగ్రత్త సుమీ అని అతనితో చెప్పెను.

ఆదికాండము 35:27

అబ్రాహామును ఇస్సాకును పరదేశులైయుండిన మమ్రేలో కిర్యతర్బాకు తన తండ్రియైన ఇస్సాకు నొద్దకు యాకోబు వచ్చెను. అదే హెబ్రోను.

ద్వితియోపదేశాకాండము 26:5

నీవు నా తండ్రి నశించుచున్న అరామీ దేశస్థుడు; అతడు ఐగుప్తునకు వెళ్లెను. కొద్దిమందితో అక్కడికి పోయి పరవాసియై, గొప్పదియు బలమైనదియు విస్తారమైనదియునగు జనమాయెను.

యెహెజ్కేలు 27:16

నీచేత చేయబడిన వివిధ వస్తువులను కొనుక్కొనుటకై సిరియనులు నీతో వర్తకవ్యాపారము చేయుదురు, వారు పచ్చరాళ్లను ఊదారంగు నూలుతో కుట్టబడిన చీరలను అవిసెనార బట్టలను పగడములను రత్నములను ఇచ్చి నీ సరకులు కొనుక్కొందురు.