లేఖనాలను అన్వేషించండి

ఆదికాండము 28: 6

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఇస్సాకు యాకోబును దీవించి, పద్దనరాములో పెండ్లిచేసికొని వచ్చుటకై అతని నక్కడికి పంపెననియు, అతని దీవించినప్పుడు నీవు కనాను దేశపు కుమార్తెలలో ఎవరిని పెండ్లి చేసికొనవద్దని అతనికి ఆజ్ఞాపించెననియు"

సంబంధిత రిఫరెన్స్‌లు

ఆదికాండము 27:33

ఇస్సాకు మిక్కుటముగా గడగడ వణకుచు అట్లయితే వేటాడిన భోజ్యమును నాయొద్దకు తెచ్చినవారెవరు? నీవు రాక మునుపు నేను వాటన్నిటిలో తిని అతనిని నిజముగా దీవించితిని, అతడు దీవింపబడినవాడే యనెను.

ఆదికాండము 28:1

ఇస్సాకు యాకోబును పిలిపించి నీవు కనాను కుమార్తెలలో ఎవతెను వివాహము చేసికొనకూడదు.

ఆదికాండము 24:54

అతడును అతనితోకూడ నున్న మనుష్యులును అన్నపానములు పుచ్చుకొని అక్కడ ఆ రాత్రియంతయు నుండిరి. ఉదయమున వారు లేచినప్పుడు అతడు నా యజమానునియొద్దకు నన్ను పంపించుడని చెప్పగా

ఆదికాండము 25:20

ఇస్సాకు పద్దనరాములో నివసించు సిరియావాడైన బెతూయేలు కుమార్తెయును సిరియావాడైన లాబాను సహోదరియునైన రిబ్కాను పెండ్లి చేసికొన్నప్పుడు నలుబది సంవత్సరములవాడు.

ఆదికాండము 33:18

అట్లు యాకోబు పద్దనరాములో నుండి వచ్చిన తరువాత కనాను దేశములోనున్న షెకెమను ఊరికి సురక్షితముగా వచ్చి ఆ ఊరిముందర తన గుడారములు వేసెను.

ఆదికాండము 34:1

లేయా యాకోబునకు కనిన కుమార్తెయైన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్లెను.

నిర్గమకాండము 2:15

ఫరో ఆ సంగతి విని మోషేను చంపచూచెను గాని, మోషే ఫరో యెదుటనుండి పారిపోయి మిద్యాను దేశములో నిలిచిపోయి యొక బావియొద్ద కూర్చుండెను.

సంఖ్యాకాండము 12:1

మోషే కూషుదేశపు స్త్రీని పెండ్లి చేసికొనియుండెను గనుక అతడు పెండ్లి చేసికొనిన ఆ స్త్రీనిబట్టి మిర్యాము అహరోనులు అతనికి విరోధముగా మాటలాడిరి.