ఆదికాండము 29: 24
క్రాస్-రిఫరెన్స్‌లు
" మరియు లాబాను తన దాసియైన జిల్పాను తన కుమార్తెయైన లేయాకు దాసిగా ఇచ్చెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
అబ్రాము భార్యయైన శారయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు అను ఐగుప్తీయురాలైన దాసి యుండెను.
కాబట్టి వారు తమ సహోదరియైన రిబ్కాను ఆమె దాదిని అబ్రాహాము సేవకుని అతనితో వచ్చిన మనుష్యులను సాగనంపినప్పుడు
లేయా తనకు కానుపు ఉడుగుట చూచి తన దాసియైన జిల్పాను తీసికొని యాకోబునకు ఆమెను భార్యగా ఇచ్చెను.
లేయా దాసియైన జిల్పా యాకోబునకు కుమారుని కనగా
లేయా ఇది అదృష్టమేగదా అనుకొని అతనికి గాదు అను పేరు పెట్టెను.
లేయా దాసియైన జిల్పా యాకోబునకు రెండవ కుమారుని కనగా
లాబాను తన కుమార్తెయైన లేయాకిచ్చిన జిల్పా కుమారులు వీరే. ఆమె యీ పదునారు మందిని యాకోబునకు కనెను.
మరియు లాబాను తన దాసియగు బిల్హాను తన కుమార్తెయైన రాహేలుకు దాసిగా ఇచ్చెను.
అందుకు రాహేలును లేయాయు యింక మా తండ్రి యింట మాకు పాలుపంపులెక్కడివి? అతడు మమ్మును అన్యులుగా చూచుట లేదా?