ఆదికాండము 40: 2
క్రాస్-రిఫరెన్స్‌లు
" గనుక ఫరో పానదాయకుల అధిపతియు భక్ష్యకారుల అధిపతియునైన తన యిద్దరు ఉద్యోగస్థుల మీద కోపపడి"
సంబంధిత రిఫరెన్స్‌లు
నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును ఆగ్రహ శేషమును నీవు ధరించుకొందువు.
రాజు క్రోధము మరణదూత జ్ఞానియైనవాడు ఆ క్రోధమును శాంతిపరచును.
రాజు కోపము సింహగర్జన వంటిది అతని కటాక్షము గడ్డిమీద కురియు మంచువంటిది.
మహా కోపియగువాడు దండన తప్పించుకొనడు వాని తప్పించినను వాడు మరల కోపించుచునే యుండును.
క్రోధము క్రూరమైనది కోపము వరదవలె పొర్లునది. రోషము ఎదుట ఎవడు నిలువగలడు?
తూరీయులమీదను సీదోనీయులమీదను అతనికి అత్యాగ్రహము కలిగినందున వారేకమనస్సుతో రాజునొద్దకు వచ్చి అంతఃపురమునకు పైవిచారణకర్తయగు బ్లాస్తును తమ పక్షముగా చేసికొని సమాధానపడవలెనని వేడుకొనిరి; ఎందుకనగా రాజుయొక్క దేశమునుండి వారి దేశమునకు గ్రాసము వచ్చుచుండెను.
ద్రాక్షతోటలమీద రామాతీయుడైన షిమీయు, ద్రాక్షతోటల ఆదాయమైన ద్రాక్షారసము నిలువచేయు కొట్లమీద షిష్మీయుడైన జబ్దియు నియమింపబడిరి.
ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో యెదుట ఆమెను పొగడిరి గనుక ఆ స్త్రీ ఫరో యింటికి తేబడెను.
అతడు తెలిపిన భావము మంచిదని భక్ష్యకారుల అధిపతి చూచి అతనితో నిట్లనెను నేనును కల కంటిని; ఇదిగో తెల్లని పిండివంటలు గల మూడు గంపలు నా తలమీద ఉండెను.
ఫరో తన దాసులమీద కోపగించి నన్నును భక్ష్యకారుల అధిపతిని మా ఉభయులను రాజసంరక్షక సేనాధిపతి యింట కావలిలో ఉంచెను.
యెహోవా చెవి యొగ్గి నీ దాసుడనైన నా మొఱ్ఱను, నీ నామమును భయభక్తులతో ఘనపరచుటయందు ఆనందించు నీ దాసుల మొఱ్ఱను ఆలకించి, ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరచి, ఈ మనుష్యుడు నాయందు దయచూపునట్లు అనుగ్రహించుమని నిన్ను బతిమాలుకొనుచున్నాను, అని ప్రార్థించితిని. నేను రాజునకు గిన్నె అందించువాడనై యుంటిని.