ఆదికాండము 41: 48
క్రాస్-రిఫరెన్స్‌లు
" ఐగుప్తు దేశమందున్న యేడు సంవత్సరముల ఆహారమంతయు అతడు సమకూర్చి, ఆ యా పట్టణములలో దాని నిలువచేసెను. ఏ పట్టణము చుట్టునుండు పొలముయొక్క ధాన్యము ఆ పట్టణమందే నిలువచేసెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
ఫరో అట్లు చేసి యీ దేశముపైన అధిపతులను నియమించి సమృద్ధిగా పంటపండు ఏడు సంవత్సరములలో ఐగుప్తు దేశమందంతటను అయిదవ భాగము తీసికొనవలెను.
రాబోవు ఈ మంచి సంవత్సరములలో దొరుకు ఆహారమంతయు సమకూర్చి ఆ ధాన్యము ఫరోచేతికప్పగించి ఆ యా పట్టణములలో ఆహారమునకై భద్రము చేయవలెను.
కరవుచేత ఈ దేశము నశించిపోకుండ ఆ ఆహారము ఐగుప్తు దేశములో రాబోవు కరవు సంవత్సరములు ఏడింటికి ఈ దేశమందు సంగ్రహముగా నుండునని ఫరోతో చెప్పెను.
అతడు ఐగుప్తు పొలిమేరలయొక్క యీ చివరనుండి ఆ చివర వరకును జనులను ఊళ్లలోనికి రప్పించెను.
రాబోవు ఈ మంచి సంవత్సరములలో దొరుకు ఆహారమంతయు సమకూర్చి ఆ ధాన్యము ఫరోచేతికప్పగించి ఆ యా పట్టణములలో ఆహారమునకై భద్రము చేయవలెను.
రాజు బొక్కసములమీద అదీయేలు కుమారుడైన అజ్మావెతు నియమింపబడెను; అయితే పొలములలోను పట్టణములలోను గ్రామములలోను దుర్గములలోను ఉండు ఆస్తిమీద ఉజ్జియా కుమారుడైన యెహోనాతాను నియమింపబడెను.