ఆదికాండము 48: 1
క్రాస్-రిఫరెన్స్‌లు
" ఈ సంగతులైన తరువాత ఇదిగో నీ తండ్రి కాయిలాగా ఉన్నాడని ఒకడు యోసేపుతో చెప్పెను. అప్పుడతడు మనష్షే ఎఫ్రాయిములు అను తన యిద్దరు కుమారులను వెంటబెట్టుకొనిపోగా,"
సంబంధిత రిఫరెన్స్‌లు
అతని అక్క చెల్లెండ్రు ప్రభువా, యిదిగో నీవు ప్రేమించువాడు రోగియై యున్నాడని ఆయనయొద్దకు వర్తమానము పంపిరి.
కరవు సంవత్సరములు రాకమునుపు యోసేపు కిద్దరు కుమారులు పుట్టిరి. ఓను యొక్క యాజకుడైన పోతీఫెర కుమార్తెయగు ఆసెనతు అతనికి వారిని కనెను.
అప్పుడు యోసేపు దేవుడు నా సమస్త బాధను నా తండ్రియింటి వారినందరిని నేను మరచిపోవునట్లు చేసెనని చెప్పి తన జ్యేష్ఠకుమారునికి మనష్షే అను పేరు పెట్టెను.
తరువాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధిపొందించెనని చెప్పి, రెండవవానికి ఎఫ్రాయిము అను పేరు పెట్టెను.
యోసేపునకు మనష్షే ఎఫ్రాయిములు పుట్టిరి. వారిని ఐగుప్తుదేశమందు ఓనుకు యాజకుడగు పోతీఫెర కుమార్తెయైన ఆసెనతు అతనికి కనెను.
యోసేపు ఎఫ్రాయిము యొక్క మూడవతరము పిల్లలను చూచెను; మరియు మనష్షే కుమారుడైన మాకీరునకు కుమారులు పుట్టి యోసేపు ఒడిలో ఉంచబడిరి.
అటుతరువాత యోబు నూట నలువది సంవత్సరములు బ్రదికి, తన కుమారులను కుమారుల కుమారులను నాలుగు తరములవరకు చూచెను. పిమ్మట యోబు కాలము నిండిన వృద్ధుడై మృతినొందెను.
నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలుమీద సమాధానముండును గాక.
మరియు ఆమె--యెహోవా మరియొక కుమారుని నాకు దయచేయును గాక అనుకొని అతనికి యోసేపు అను పేరు పెట్టెను.
అందుకతడు నేను నీ మాట చొప్పున చేసెదననెను. మరియు అతడు నాతో ప్రమాణము చేయుమన్నప్పుడు యోసేపు అతనితో ప్రమాణము చేసెను. అప్పుడు ఇశ్రాయేలు తన మంచపు తలాపిమీద వంగి దేవునికి నమస్కారము చేసెను
యోసేపు ఫలించెడి కొమ్మ ఊటయొద్ద ఫలించెడి కొమ్మదాని రెమ్మలు గోడమీదికి ఎక్కి వ్యాపించును.
యోసేపు పుత్రుల వంశావళి, అనగా ఎఫ్రాయిము పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా
మనష్షే పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా
అంతట ఎలీషా మరణకరమైన రోగముచేత పీడితుడైయుండగా ఇశ్రాయేలు రాజైన యెహోయాషు అతనియొద్దకు వచ్చి అతని చూచి కన్నీరు విడుచుచు నా తండ్రీ నా తండ్రీ, ఇశ్రాయేలువారికి రథమును రౌతులును నీవే అని యేడ్చెను.
విందు జరుగుచున్న యింటికి పోవుటకంటె ప్రలాపించుచున్నవారి యింటికి పోవుట మేలు; ఏలయనగా మరణము అందరికిని వచ్చును గనుక బ్రదుకువారు దానిని మనస్సున పెట్టుదురు.
అప్పుడు ఆయన వారిమీద చేతులుంచి ప్రార్థన చేయవలెనని కొందరు చిన్నపిల్లలను ఆయనయొద్దకు తీసికొనివచ్చిరి.
మరియ, ఆమె సహోదరియైన మార్త, అనువారి గ్రామమైన బేతనియలోనున్న లాజరు అను ఒకడు రోగి యాయెను.