ఆదికాండము 49: 16
క్రాస్-రిఫరెన్స్‌లు
" దాను ఇశ్రాయేలు గోత్రికులవలె తన ప్రజలకు న్యాయము తీర్చును."
సంబంధిత రిఫరెన్స్‌లు
అప్పుడు రాహేలు దేవుడు నాకు తీర్పుతీర్చెను; ఆయన నా మొరను విని నాకు కుమారుని దయచేసెననుకొని అతనికి దాను అని పేరు పెట్టెను.
దానీయుల పాళెపు ధ్వజము సాగెను; అది పాళెములన్నిటిలో వెనుకనుండెను; అమీషదాయి కుమారుడైన అహీయెజరు ఆ సైన్యమునకు అధిపతి
దానునుగూర్చి యిట్లనెను దాను సింహపుపిల్ల అది బాషానునుండి దుమికి దాటును.
ఆ కాలమున దానువంశస్థుడును జొర్యాపట్టణస్థుడు నైన మానోహ అను నొకడుండెను. అతని భార్య గొడ్రాలై కానుపులేకయుండెను.
తరువాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సమ్సోను అను పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతని నాశీర్వదించెను.
మరియు యెహోవా ఆత్మజొర్యా కును ఎష్తాయోలుకును మధ్యనున్న మహనెదానులో అతని రేపుటకు మొదలు పెట్టెను.
అతడు ఫిలిష్తీయుల దినములలో ఇరువదియేండ్లు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతియైయుండెను.
ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు. మరియు ఇశ్రాయేలీయుల గోత్రములలో ఆ దినమువరకు దానీయులు స్వాస్థ్యము పొంది యుండలేదు గనుక ఆ కాలమున తాము నివసించుటకు తమకు స్వాస్థ్యము వెదకు కొనుటకై వారు బయలుదేరియుండిరి.
ఆ దేశసంచారము చేసి దానిని పరిశోధించుటకై దానీయులు తమ వంశస్థు లందరిలోనుండి పరాక్రమ వంతులైన అయిదుగురు మను ష్యులను జొర్యానుండియు ఎష్తాయోలునుండియు పంపిమీరు వెళ్లి దేశమును పరిశోధించుడని వారితోచెప్పగా
దాను కుమారుడైన హుషీము.
దాను పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా