లేఖనాలను అన్వేషించండి

ఆదికాండము 49: 30

క్రాస్-రిఫరెన్స్‌లు

" హిత్తీయుడైన ఎఫ్రోను భూమియందున్న గుహలో నా తండ్రులయొద్ద నన్ను పాతిపెట్టుడి. ఆ గుహ కనాను దేశమందలి మమ్రే యెదుటనున్న మక్పేలా పొలములో ఉన్నది. అబ్రాహాము దానిని ఆ పొలమును హిత్తీయుడగు ఎఫ్రోనుయొద్ద శ్మశానభూమి కొరకు స్వాస్థ్యముగా కొనెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

ఆదికాండము 23:8

మృతిబొందిన నా భార్యను నా యెదుట ఉండకుండ నేను పాతిపెట్టుట మీకిష్టమైతే నా మాట వినుడి.

ఆదికాండము 23:3

తరువాత అబ్రాహాము మృతిబొందిన తన భార్య యెదుటనుండి లేచి హేతు కుమారులను చూచి

ఆదికాండము 23:4

మీ మధ్య నేను పరదేశినిగాను పరవాసినిగాను ఉన్నాను. మృతిబొందిన నా భార్య నా కన్నులయెదుట ఉండకుండ, ఆమెను పాతిపెట్టుటకు మీతావున నా కొక శ్మశానభూమిని స్వాస్థ్యముగా ఇయ్యుడని అడుగగా

ఆదికాండము 23:17

ఆలాగున మమ్రే యెదుటనున్న మక్పేలా యందలి ఎఫ్రోను పొలము, అనగా ఆ పొలమును దానియందలి గుహయు దాని పొలిమేర అంతటిలోనున్న ఆ పొలము చెట్లన్నియు,

ఆదికాండము 25:9

హిత్తీయుడైన సోహరు కుమారుడగు ఎఫ్రోను పొలమందలి మక్పేలా గుహలో అతని కుమారులగు ఇస్సాకును ఇష్మాయేలును అతనిని పాతిపెట్టిరి; అది మమ్రే యెదుట నున్నది.

ఆదికాండము 33:19

మరియు అతడు తన గుడారములు వేసిన పొలము యొక్క భాగమును షెకెము తండ్రియైన హమోరు కుమారులయొద్ద నూరు వరహాలకు కొని

ఆదికాండము 50:5

నా తండ్రి నాచేత ప్రమాణము చేయించి ఇదిగో నేను చనిపోవుచున్నాను, కనానులో నా నిమిత్తము సమాధి త్రవ్వించితిని గదా, అందులోనే నన్ను పాతిపెట్టవలెనని చెప్పెను. కాబట్టి సెలవైతే నేనక్కడికి వెళ్లి నా తండ్రిని పాతిపెట్టి మరల వచ్చెదనని చెప్పుడనెను.

1దినవృత్తాంతములు 1:13

కనాను తన జ్యేష్ఠకుమారుడైన సీదోనును హేతును కనెను.