లేఖనాలను అన్వేషించండి

ఆదికాండము 6: 21

క్రాస్-రిఫరెన్స్‌లు

" మరియు తినుటకు నానావిధములైన ఆహారపదార్థములను కూర్చుకొని నీదగ్గర ఉంచుకొనుము; అవి నీకును వాటికిని ఆహారమగునని చెప్పెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

ఆదికాండము 1:29

దేవుడు ఇదిగో భూమిమీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్షఫలముగల ప్రతి వృక్షమును మీకిచ్చియున్నాను; అవి మీకాహారమగును.

ఆదికాండము 1:30

భూమిమీదనుండు జంతువులన్నిటికిని ఆకాశ పక్షులన్నిటికిని భూమిమీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నియు ఆహారమగునని పలికెను. ఆ ప్రకారమాయెను.

యోబు 38:41

తిండిలేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొఱ్ఱపెట్టునప్పుడు కాకికి ఆహారము సిద్ధపరచువాడెవడు?

యోబు 40:20

పర్వతములలో దానికి మేత మొలచును అరణ్యజంతువులన్నియు అచ్చట ఆడుకొనును.

కీర్తనలు 35:6

యెహోవా దూత వారిని తరుమునుగాక వారి త్రోవ చీకటియై జారుడుగా నుండునుగాక.

కీర్తనలు 104:27

తగిన కాలమున నీవు వాటికి ఆహారమిచ్చెదవని ఇవన్నియు నీ దయకొరకు కనిపెట్టుచున్నవి

కీర్తనలు 104:28

నీవు వాటికి పెట్టునది అవి కూర్చుకొనును నీవు గుప్పిలి విప్పగా అవి మంచివాటిని తిని తృప్తిపరచబడును.

కీర్తనలు 136:25

సమస్త జీవులకును ఆయన ఆహారమిచ్చుచున్నాడు ఆయన కృప నిరంతరముండును.

కీర్తనలు 145:16

నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు.

కీర్తనలు 147:9

పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారమిచ్చువాడు.

మత్తయి 6:26

ఆకాశపక్షులను చూడుడి; అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు; అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు; మీరు వాటికంటె బహు శ్రేష్టులు కారా?