లేఖనాలను అన్వేషించండి

యిర్మియా 12: 4

క్రాస్-రిఫరెన్స్‌లు

" భూమి యెన్నాళ్లు దుఃఖింపవలెను? దేశమంతటిలోని గడ్డి ఎన్నాళ్లు ఎండిపోవలెను? అతడు మన అంతము చూడడని దుష్టులు చెప్పుకొనుచుండగా దేశములో నివసించువారి చెడుతనమువలన జంతువులును పక్షులును సమసిపోవుచున్నవి."

సంబంధిత రిఫరెన్స్‌లు

యిర్మియా 11:20

నీతినిబట్టి తీర్పు తీర్చుచు జ్ఞానేంద్రియములను, హృదయమును శోధించువాడు సైన్యములకధిపతియగు యెహోవాయే. యెహోవా, నా వ్యాజ్యెభారమును నీమీదనే వేయుచున్నాను; వారికి నీవు చేయు ప్రతిదండనను నన్ను చూడనిమ్ము.

2రాజులు 20:3

యెహోవా, యథార్థ హృదయుడనై, సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసికొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను.

1దినవృత్తాంతములు 29:17

నా దేవా, నీవు హృదయ పరిశోధనచేయుచు యథార్థవంతులయందు ఇష్టపడుచున్నావని నేనెరుగుదును; నేనైతే యథార్థహృదయము గలవాడనై యివి యన్నియు మనఃపూర్వకముగా ఇచ్చియున్నాను; ఇప్పుడు ఇక్కడనుండు నీ జనులును నీకు మనఃపూర్వకముగా ఇచ్చుట చూచి సంతోషించుచున్నాను.

యోబు 23:10

నేను నడచుమార్గము ఆయనకు తెలియును ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణమువలె కనబడుదును.

కీర్తనలు 17:3

రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయు కానరాలేదు నోటిమాటచేత నేను అతిక్రమింపను

కీర్తనలు 26:1

యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను నాకు తీర్పు తీర్చుము ఏమియు సందేహపడకుండ యెహోవాయందు నేను నమ్మిక యుంచియున్నాను.

కీర్తనలు 44:21

హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానునా?

కీర్తనలు 139:1

యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలిసికొనియున్నావు

కీర్తనలు 139:23

దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలిసికొనుము నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలిసికొనుము

యోహాను 21:17

మూడవసారి ఆయన యోహాను కుమారుడవైన సీమోనూ, నన్ను ప్రేమించుచున్నావా? అని అతనిని అడిగెను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి ప్రభువా, నీవు సమస్తము ఎరిగినవాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే యెరుగుదువని ఆయనతో చెప్పెను.

1యోహాను 3:20

ప్రియులారా, మన హృదయము మనయందు దోషారోపణ చేయనియెడల దేవుని యెదుట ధైర్యము గలవారమగుదుము.

1యోహాను 3:21

మరియు మనమాయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక, మనమేమి అడిగినను అది ఆయనవలన మనకు దొరుకును.

యిర్మియా 17:18

నన్ను సిగ్గుపడనియ్యక నన్ను తరుమువారిని సిగ్గుపడనిమ్ము నన్ను దిగులుపడనియ్యక వారిని దిగులుపడనిమ్ము, వారిమీదికి ఆపద్దినము రప్పించుము, రెట్టింపు నాశనముతో వారిని నశింపజేయుము.

యిర్మియా 18:21

వారి కుమారులను క్షామమునకు అప్పగింపుము, ఖడ్గ బలమునకు వారిని అప్పగింపుము, వారి భార్యలు పిల్లలులేనివారై విధవరాండ్రగుదురు గాక, వారి పురుషులు మరణహతులగుదురు గాక, వారి యౌవనులు యుద్ధములో ఖడ్గముచేత హతులగుదురు గాక.

యిర్మియా 18:22

నన్ను పట్టుకొనుటకు వారు గొయ్యి త్రవ్విరి, నా కాళ్లకు ఉరులనొగ్గిరి; వారిమీదికి నీవు ఆకస్మికముగా దండును రప్పించుటవలన వారి యిండ్లలోనుండి కేకలు వినబడును గాక.

యిర్మియా 18:23

యెహోవా, నాకు మరణము రావలెనని వారు నా మీద చేసిన ఆలోచన అంతయు నీకు తెలిసేయున్నది, వారి దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగనియ్యకుము, నీ సన్నిధినుండి వారి పాపమును తుడిచివేయకుము; వారు నీ సన్నిధిని తొట్రిల్లుదురు గాక, నీకు కోపము పుట్టు కాలమున వారికి తగినపని చేయుము.

యిర్మియా 20:12

సైన్యములకధిపతివగు యెహోవా, నీతిమంతులను పరిశోధించువాడవు నీవే; అంతరింద్రియములను హృదయమును చూచువాడవు నీవే; నా వ్యాజ్యెమును నీకే అప్పగించుచున్నాను. నీవు వారికి చేయు ప్రతిదండన నేను చూతును గాక

యిర్మియా 48:15

మోయాబు పాడైపోవుచున్నది శత్రువులు దాని పట్టణములలో చొరబడుచున్నారు వారి యౌవనులలో శ్రేష్ఠులు వధకు పోవుచున్నారు సైన్యములకధిపతియగు యెహోవా అను పేరుగల రాజు సెలవిచ్చినమాట యిదే.

యిర్మియా 50:27

దాని యెడ్లన్నిటిని వధించుడి అవి వధకు పోవలెను అయ్యో, వారికి శ్రమ వారి దినము ఆసన్నమాయెను వారి దండనకాలము వచ్చెను.

యిర్మియా 51:4

యౌవనులను కొట్టక మానకుడి దాని సర్వసైన్యమును బొత్తిగా నిర్మూలము చేయుడి.

యిర్మియా 11:19

అయితే నేను వధకు తేబడుచుండు సాధువైన గొఱ్ఱపిల్లవలె ఉంటిని; మనము చెట్టును దాని ఫలమును నశింపజేయుదము రండి, వాని పేరు ఇకను జ్ఞాపకము చేయబడకపోవునట్లు బ్రదుకువారిలో నుండకుండ వాని నిర్మూలము చేయుదము రండని వారు నామీద చేసిన దురాలోచనలను నేనెరుగకయుంటిని.

కీర్తనలు 44:22

నిన్నుబట్టి దినమెల్ల మేము వధింపబడుచున్నాము వధకు సిద్ధమైన గొఱ్ఱలమని మేము ఎంచబడుచున్నాము

యాకోబు 5:5

మీరు భూమిమీద సుఖముగా జీవించి భోగాసక్తులై వధ దినమునందు మీ హృదయములను పోషించుకొంటిరి.

ఆదికాండము 6:7

అప్పుడు యెహోవా నేను సృజించిన నరులును నరులతోకూడ జంతువులును పురుగులును ఆకాశ పక్ష్యాదులును భూమిమీద నుండకుండ తుడిచివేయుదును; ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొందియున్నాననెను

ఆదికాండము 7:21

అప్పుడు పక్షులేమి పశువులేమి మృగములేమి భూమిమీద ప్రాకు పురుగులేమి భూమిమీద సంచరించు సమస్త శరీరులేమి సమస్త నరులేమి చచ్చిపోయిరి.

యెహోషువ 22:22

దేవుళ్లలో యెహోవా దేవుడు, దేవుళ్లలో యెహోవాయే దేవుడు; సంగతి ఆయనకు తెలి యును, ఇశ్రాయేలీయులు తెలిసి కొందురు, ద్రోహముచేతనైనను యెహోవామీద తిరుగుబాటుచేతనైనను మేము ఈ పని చేసినయెడల నేడు మమ్ము బ్రదుకనియ్యకుడి.

కీర్తనలు 44:11

భోజనపదార్థముగా ఒకడు గొఱ్ఱలను అప్పగించునట్లు నీవు మమ్మును అప్పగించియున్నావు అన్యజనులలోనికి మమ్మును చెదరగొట్టియున్నావు

కీర్తనలు 49:14

వారు పాతాళములో మందగా కూర్చబడుదురు మరణము వారికి కాపరియైయుండును ఉదయమున యథార్థవంతులు వారినేలుదురు వారి స్వరూపములు నివాసములేనివై పాతాళములో క్షయమైపోవును.

యిర్మియా 15:15

యెహోవా, నా శ్రమ నీకే తెలిసియున్నది; నన్ను జ్ఞాపకము చేసికొనుము, నన్ను దర్శించుము, నన్ను హింసించువారికి నాకొరకై ప్రతిదండన చేయుము, నీవు దీర్ఘశాంతి కలిగినవాడవై నన్ను కొనిపోకుము, నీ నిమిత్తము నాకు నింద వచ్చుచున్నదని తెలిసికొనుము.

యిర్మియా 21:6

మనుష్యులనేమి పశువులనేమి యీ పట్టణపు నివాసులనందరిని హతము చేసెదను; గొప్ప తెగులుచేత వారు చచ్చెదరు.

యిర్మియా 23:10

దేశము వ్యభిచారులతో నిండియున్నది, జనుల నడవడి చెడ్డదాయెను, వారి శౌర్యము అన్యాయమున కుపయోగించుచున్నది గనుక శాపగ్రస్తమై దేశము దుఃఖపడుచున్నది; అడవిబీళ్లు ఎండిపోయెను.

యిర్మియా 40:15

కారేహ కుమారుడగు యోహానాను మిస్పాలో గెదల్యాతో రహస్యముగా ఇట్లనెను నీయొద్దకు కూడివచ్చిన యూదులందరు చెదరిపోవునట్లును, యూదా జనశేషము నశించునట్లును నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు నిన్ను చంపనేల? దయచేసి నన్ను వెళ్లనిమ్ము, ఎవనికి తెలియకుండ నేను వానిని చంపెదను.

అపోస్తలులకార్యములు 8:32

అతడు లేఖనమందు చదువుచున్న భాగమేదనగా ఆయన గొఱ్ఱవలె వధకు తేబడెను బొచ్చు కత్తిరించువాని యెదుట గొఱ్ఱపిల్ల ఏలాగు మౌనముగా ఉండునో ఆలాగే ఆయన నోరు తెరవకుండెను.

రోమీయులకు 8:36

ఇందునుగూర్చి వ్రాయబడినదేమనగా నిన్నుబట్టి దినమెల్ల మేము వధింపబడినవారము వధకు సిద్ధమైన గొఱ్ఱలమని మేము ఎంచబడినవారము.

2పేతురు 2:12

వారైతే పట్టబడి చంపబడుటకే స్వభావసిద్ధముగా పుట్టిన వివేకశూన్యములగు మృగములవలె ఉండి, తమకు తెలియని విషయములనుగూర్చి దూషించుచు, తమ దుష్‌ప్రవర్తనకు ప్రతిఫలముగా హాని అనుభవించుచు, తాము చేయు నాశనముతోనే తామే నాశనము పొందుదురు,