యిర్మియా 30: 15
క్రాస్-రిఫరెన్స్‌లు
" నీ గాయముచేత నీవు అరచెదవేమి? నీకు కలిగిన నొప్పి నివారణ కాదు; నీ పాపములు విస్తరించినందున నీ దోషములనుబట్టి నేను నిన్ను ఈలాగు చేయుచున్నాను."
సంబంధిత రిఫరెన్స్‌లు
నీ మార్గము మార్చుకొనుటకు నీవేల ఇటు అటు తిరుగులాడుచున్నావు? నీవు అష్షూరును ఆధారము చేసికొని సిగ్గుపడినట్లు ఐగుప్తును ఆధారము చేసికొని సిగ్గుపడెదవు.
దోచుకొనబడినదానా, నీవేమి చేయుదువు? రక్త వర్ణవస్త్రములు కట్టుకొని సువర్ణ భూషణములు ధరించి కాటుకచేత నీ కన్నులు పెద్దవిగా చేసికొనుచున్నావే; నిన్ను నీవు అలంకరించుకొనుట వ్యర్థమే; నీ విటకాండ్రు నిన్ను తృణీకరించుదురు, వారే నీ ప్రాణము తీయజూచుచున్నారు.
నీ విటకాండ్రు నాశనమైరి. లెబానోనును ఎక్కి కేకలువేయుము; బాషానులో బిగ్గరగా అరువుము, అబారీమునుండి కేకలువేయుము.
నీ కాపరులందరు గాలి పీల్చుదురు, నీ విటకాండ్రు చెరలోనికి పోవుదురు, నీ చెడుతనమంతటినిబట్టి నీవు అవమానమునొంది సిగ్గుపడుదువు.
యూదా రాజు నగరులో శేషించియున్న స్త్రీలందరు బబులోను అధిపతులయొద్దకు కొనిపోబడెదరు, ఆలాగు జరుగగా ఆ స్త్రీలు నిన్ను చూచి నీ ప్రియస్నేహితులు నిన్ను మోసపుచ్చి నీ పైని విజయము పొందియున్నారు, నీ పాదములు బురదలో దిగబడియుండగా వారు వెనుకతీసిరని యందురు.
రాత్రియందు అది బహుగా ఏడ్చుచున్నది కన్నీరు దాని చెంపలమీద కారుచున్నది దాని విటకాండ్రందరిలో దాని నోదార్చువాడొకడును లేడు దాని చెలికాండ్రందరు దాని మోసపుచ్చిరి వారు దానికి శత్రువులైరి.
నా విటకాండ్రను నేను పిలువనంపగా వారు నన్ను మోసపుచ్చిరి నా యాజకులును నా పెద్దలును ప్రాణసంరక్షణకై ఆహారము వెదకపోయి పట్టణములో ప్రాణము విడిచినవారైరి.
కావున దాని విటకాండ్రకు నేను దానిని అప్పగించియున్నాను, అది మోహించిన అష్షూరువారికి దానిని అప్పగించియున్నాను.
కావున ఒహొలీబా, ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా నీ మనస్సునకు ఎడమైపోయిన నీ విటకాండ్రను రేపి నలుదిక్కులు వారిని నీమీదికి రప్పించెదను.
అది నాకు అన్నపానములను గొఱ్ఱబొచ్చును జనుపనారయు తైలమును మద్యమును ఇచ్చిన నా విటకాండ్రను నేను వెంటాడుదుననుకొనుచున్నది.
దాని విటకాండ్రు చూచుచుండగా నేను దాని పోకిరితనమును బయలుపరతును, నాచేతిలో నుండి దాని విడిపించువాడొకడును లేకపోవును.
దాని ఉత్సవకాలములను పండుగలను అమావాస్యలను విశ్రాంతిదినములను నియామకకాలములను మాన్పింతును.
ఇవి నా విటకాండ్రు నాకిచ్చిన జీతమని అది తన ద్రాక్షచెట్లనుగూర్చియు అంజూరపు చెట్లనుగూర్చియు చెప్పినది గదా. నేను వాటిని లయపరతును, అడవిజంతువులు వాటిని భక్షించునట్లు వాటిని అడవివలెచేతును.
అది నన్ను మరచిపోయి నగలు పెట్టుకొని శృంగారించుకొని బయలుదేవతలకు ధూపము వేసి యుండుటను బట్టియు దాని విటకాండ్రను వెంటాడి యుండుటను బట్టియు నేను దానిని శిక్షింతును; ఇది యెహోవా వాక్కు.
పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యములోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాటలాడుదును;
అక్కడనుండి దానిని తోడుకొనివచ్చి దానికి ద్రాక్షచెట్లనిత్తును; ఆకోరు (శ్రమగల) లోయను నిరీక్షణ ద్వారముగా చేసెదను, బాల్యమున ఐగుప్తు దేశములోనుండి అది వచ్చినప్పుడు నా మాట వినినట్లు
అది ఇచ్చటనుండి నా మాట వినును; నీవు బయలు అని నన్ను పిలువక నా పురుషుడవు అని పిలుతువు, ఇదే యెహోవా వాక్కు.
నీవు చూచిన ఆ పది కొమ్ములు పదిమంది రాజులు. వారిదివరకు రాజ్యమును పొందలేదు గాని యొక గడియ క్రూరమృగముతో కూడ రాజులవలె అధికారము పొందుదురు.
వీరు ఏకాభిప్రాయము గలవారై తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగింతురు.
వీరు గొఱ్ఱపిల్లతో యుద్ధముచేతురు గాని, గొఱ్ఱపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై యున్నందునను, తనతో కూడ ఉండినవారు పిలువబడినవారై, యేర్పరచబడినవారై, నమ్మకమైనవారై యున్నందునను, ఆయన ఆ రాజులను జయించును.
మరియు ఆ దూత నాతో ఈలాగు చెప్పెను ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను, జన సమూహములను, జనములను, ఆ యా భాషలు మాటలాడువారిని సూచించును.
నీవు ఆ పది కొమ్ములు గల ఆ మృగమును చూచితివే, వారు ఆ వేశ్యను ద్వేషించి, దానిని దిక్కులేని దానిగాను దిగంబరిగాను చేసి, దాని మాంసము భక్షించి అగ్నిచేత దానిని బొత్తిగా కాల్చివేతురు.
దేవుని మాటలు నెరవేరువరకు వారు ఏకాభిప్రాయము గలవారై తమ రాజ్యమును ఆ మృగమునకు అప్పగించుటవలన తన సంకల్పము కొనసాగించునట్లు దేవుడు వారికి బుద్ధి పుట్టించెను.
మరియు నీవు చూచిన ఆ స్త్రీ భూరాజుల నేలు ఆ మహా పట్టణమే.
నీవేల నీ ముఖమును మరుగుచేసికొంటివి? నన్నేల నీకు పగవానిగా ఎంచుచున్నావు?
ఇటు అటు కొట్టుకొనిపోవుచున్న ఆకును నీవు వేధించెదవా? ఎండిపోయిన చెత్తను తరుముదువా?
నీవు నాకు కఠినమైన శిక్ష విధించియున్నావు నా బాల్యకాలపు పాపములను నాకు స్వాస్థ్యముగా నీవు విధించియున్నావు
బొండలలో నా కాళ్లు బిగించియున్నావు నా ప్రవర్తన అంతయు నీవు కనిపెట్టుచున్నావు నా అరికాళ్ల చుట్టు గిఱిగీసియున్నావు
మురిగి క్షీణించుచున్న వానిచుట్టు చిమ్మటకొట్టిన వస్త్రమువంటివాని చుట్టు గిఱిగీసి వానిని కనిపెట్టుచున్నావు.
ఆయన తన కోపముచేత నామీద పడి నన్ను చీల్చెను. ఆయన నామీద పండ్లు కొరుకుచుండెను నాకు శత్రువై నామీద తన కన్నులు ఎఱ్ఱచేసెను.
ఆయన నామీద తన కోపమును రగులబెట్టెను నన్ను తన శత్రువులలో ఒకనిగా ఎంచెను.
నీవు మారిపోయి నాయెడల కఠినుడవైతివి నీ బాహుబలముచేత నన్ను హింసించుచున్నావు
ప్రభువు శత్రువాయెను ఆయన ఇశ్రాయేలును నిర్మూలము చేసియున్నాడు దాని నగరులన్నిటిని నాశనము చేసియున్నాడు దాని కోటలను పాడుచేసియున్నాడు యూదాకుమారికి అధిక దుఃఖప్రలాపములను ఆయన కలుగజేసియున్నాడు.
ఏలయనగా ఎఫ్రాయిమీయులకు సింహము వంటివాడనుగాను యూదా వారికి కొదమసింహము వంటివాడనుగాను నేనుందును. నేనే వారిని పట్టుకొని చీల్చెదను, నేనే వారిని కొనిపోవుదును, విడిపించువాడొకడును లేకపోవును
నీ గాయముచేత నీవు అరచెదవేమి? నీకు కలిగిన నొప్పి నివారణ కాదు; నీ పాపములు విస్తరించినందున నీ దోషములనుబట్టి నేను నిన్ను ఈలాగు చేయుచున్నాను.
వారు తిరుగుబాటుచేసి బహుగా విశ్వాసఘాతకులైరి గనుక అరణ్యమునుండి వచ్చిన సింహము వారిని చంపును, అడవి తోడేలు వారిని నాశనము చేయును, చిరుతపులి వారి పట్టణములయొద్ద పొంచియుండును, వాటిలోనుండి బయలుదేరు ప్రతివాడు చీల్చబడును.
నీ కోపమువలన మేము క్షీణించుచున్నాము నీ ఉగ్రతనుబట్టి దిగులుపడుచున్నాము.
మా దోషములను నీవు నీ యెదుట నుంచుకొనియున్నావు నీ ముఖకాంతిలో మా రహస్యపాపములు కనబడుచున్నవి.
నేను తప్ప మరి ఎవరును శేషింపకుండ వారు హతము చేయుట నేను చూచి సాస్టాంగపడి వేడుకొని అయ్యో, ప్రభువా, యెహోవా, యెరూషలేముమీద నీ క్రోధమును కుమ్మరించి ఇశ్రాయేలీయులలో శేషించినవారినందరిని నశింపజేయుదువా? అని మొఱ్ఱపెట్టగా
ఆయన నాకీలాగు సెలవిచ్చెను ఇశ్రాయేలు వారి యొక్కయు యూదావారి యొక్కయు దోషము బహు ఘోరముగా ఉన్నది; వారు యెహోవా దేశమును విసర్జించెననియు ఆయన మమ్మును కానడనియు ననుకొని, దేశమును హత్యతోను పట్టణమును తిరుగుబాటుతోను నింపియున్నారు.
కాబట్టి కటాక్షముంచకయు కనికరము చూపకయు నేను వారి ప్రవర్తన ఫలమును వారనుభవింపజేసెదను.
చంపబడినవారి రక్తమును చెరపట్టబడినవారి రక్తమును శత్రువులలో వీరుల తలలను నా ఖడ్గము భక్షించును నేను ఆకాశముతట్టు నా హస్తమెత్తి నా శాశ్వత జీవముతోడని ప్రమాణము చేయుచున్నాను.
నా స్నేహితులు ఎండిన వాగువలెను మాయమైపోవు జలప్రవాహములవలెను నమ్మకూడని వారైరి.
మరవబడిన వేశ్యా, సితారా తీసికొని పట్టణములో తిరుగులాడుము నీవు జ్ఞాపకమునకు వచ్చునట్లు ఇంపుగా వాయించుము అనేక కీర్తనలు పాడుము.
నిజముగా తన కార్యమును తన ఆశ్చర్యమైన కార్యమును చేయుటకు అపూర్వమైన తన కార్యము నొనరించుటకు ఆయన పెరాజీము అను కొండమీద లేచినట్లు యెహోవా లేచును గిబియోను లోయలో ఆయన రేగినట్లు రేగును.
అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా ఆయన వారికి విరోధియాయెను తానే వారితో యుద్ధము చేసెను.
వారు వింటిని ఈటెను వాడనేర్చినవారు, అది యొక క్రూర జనము; వారు జాలిలేనివారు, వారి స్వరము సముద్ర ఘోషవలె నున్నది, వారు గుఱ్ఱములెక్కి సవారి చేయువారు; సీయోను కుమారీ, నీతో యుద్ధము చేయవలెనని వారు యోధులవలె వ్యూహము తీరియున్నారు.
నీవు వారితో చెప్పవలసిన మాట ఏదనగా నా జనుల కన్యక గొప్ప ఉపద్రవమువలన పీడింపబడుచున్నది, ఘోరమైన గాయము నొందియున్నది; దివారాత్రము మానక నా కన్నులనుండి కన్నీరు కారుచున్నది.
దాని విరోధులు అధికారులైరి దాని శత్రువులు వర్ధిల్లుచున్నారు దాని అతిక్రమము విస్తారమని యెహోవా దానిని శ్రమపరచుచున్నాడు. విరోధులు దాని పసిపిల్లలను చెరపట్టుకొనిపోయిరి
శత్రువువలె ఆయన విల్లెక్కుపెట్టి విరోధివలె కుడిచెయ్యి చాపియున్నాడు కంటికి అందమైన వస్తువులన్నిటిని నాశనము చేసియున్నాడు అగ్ని కురియునట్లుగా ఆయన తన ఉగ్రతను సీయోను కుమార్తె గుడారములమీద కుమ్మరించియున్నాడు.
తాను రోగి యవుట ఎఫ్రాయిము చూచెను, తనకు పుండు కలుగుట యూదా చూచెను అప్పుడు ఎఫ్రాయిము అష్షూరీయులయొద్దకు పోయెను, రాజైన యారేబును పిలుచుకొనెను. అయితే అతడు నిన్ను స్వస్థపరచజాలడు, నీ పుండు బాగు చేయజాలడు.
నీతో సంధిచేసినవారు నిన్ను తమ సరిహద్దు వరకు పంపివేయుదురు; నీతో సమాధానముగా ఉన్నవారు నిన్ను మోసపుచ్చి నీకు బలాత్కారము చేయుదురు; వారు నీ యన్నము తిని నీకొరకు ఉరి యొడ్డుదురు; ఎదోమునకు వివేచన లేకపోయెను.