లేఖనాలను అన్వేషించండి

యిర్మియా 32: 44

క్రాస్-రిఫరెన్స్‌లు

" నేను వారిలో చెరపోయినవారిని రప్పింపబోవుచున్నాను గనుక బెన్యామీను దేశములోను యెరూషలేము ప్రాంతములలోను యూదా పట్టణములలోను మన్యములోని పట్టణములలోను దక్షిణదేశపు పట్టణములలోను మనుష్యులు క్రయమిచ్చి పొలములు కొందురు, క్రయపత్రములు వ్రాయించుకొందురు, ముద్రవేయుదురు, సాక్షులను పెట్టుదురు; ఇదే యెహోవా వాక్కు."

సంబంధిత రిఫరెన్స్‌లు

యిర్మియా 32:36

కావున ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఈ పట్టణమునుగూర్చి యీ మాట సెలవిచ్చుచున్నాడు అది ఖడ్గముచేతను క్షామముచేతను తెగులుచేతను పీడింపబడినదై బబులోను రాజు చేతికి అప్పగింపబడునని మీరీ పట్టణమునుగూర్చి చెప్పుచున్నారు గదా.

యెహెజ్కేలు 37:11

అప్పుడాయన నాతో ఇట్లనెను నరపుత్రుడా, ఈ యెముకలు ఇశ్రాయేలీయులనందరిని సూచించుచున్నవి. వారుమన యెముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయెను, మనము నాశనమైపోతివిు అని యనుకొనుచున్నారు

యెహెజ్కేలు 37:12

కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనుము ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచెదను, సమాధులలోనుండి మిమ్మును బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశములోనికి తోడుకొని వచ్చెదను.

యెహెజ్కేలు 37:13

నా ప్రజలారా, నేను సమాధులను తెరచి సమాధులలోనున్న మిమ్మును బయటికి రప్పించగా

యెహెజ్కేలు 37:14

నేను యెహోవానై యున్నానని మీరు తెలిసికొందురు, మీరు బ్రదుకునట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో మిమ్మును నివసింపజేసెదను, యెహోవానగు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్తునని మీరు తెలిసికొందురు; ఇదే యెహోవా వాక్కు.

యిర్మియా 32:15

ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఇండ్లును పొలములును ద్రాక్షతోటలును ఇంక ఈ దేశములో కొనబడును.

యిర్మియా 33:12

సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు మనుష్యులైనను జంతువులైనను లేక పాడైయున్న యీ స్థలములోను దాని పట్టణములన్నిటిలోను గొఱ్ఱల మందలను మేపుచు పరుండబెట్టు కాపరులుందురు.

విలాపవాక్యములు 3:11

నాకు త్రోవలేకుండ చేసి నా యవయవములను విడదీసియున్నాడు నాకు దిక్కులేకుండ చేసియున్నాడు

యెహెజ్కేలు 14:13

నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపముచేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారమగు ఆహారము లేకుండజేసి కరవు పంపించి మనుష్యులను పశువులను నిర్మూలము చేయుదును

యెహెజ్కేలు 29:8

కాబట్టి ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు నేను నీమీదికి ఖడ్గము రప్పించి, మనుష్యులను పశువులను నీలోనుండి నిర్మూలము చేసెదను,

యెహెజ్కేలు 36:33

మీ దోషములవలన మీకు కలిగిన అపవిత్రతను నేను తీసివేసి మీ పట్టణములలో మిమ్మును నివసింపజేయునాడు పాడైపోయిన స్థలములు మరల కట్టబడును.

యెహెజ్కేలు 38:12

వారిని దోచుకొని కొల్లసొమ్ముగా పట్టుకొనుటకై, పూర్వము పాడై మరల నివసింపబడిన స్థలములమీదికి తిరిగిపోయెదను, ఆ యా జనములలోనుండి సమకూర్చబడి, పశువులును సరకులును గలిగి, భూమి నట్టనడుమ నివసించు జనులమీదికి తిరిగిపోయెదను.

జెకర్యా 1:17

నీవు ఇంకను ప్రకటన చేయవలసినదేమనగా ఇక నా పట్టణములు భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడును, ఇంకను యెహోవా సీయోనును ఓదార్చును, యెరూషలేమును ఆయన ఇకను కోరుకొనును.

యోహాను 13:7

అందుకు యేసు నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదుగాని యికమీదట తెలిసికొందువని అతనితో చెప్పగా