యిర్మియా 36: 3
క్రాస్-రిఫరెన్స్‌లు
" నేను యూదా వారికి చేయనుద్దేశించు కీడంతటినిగూర్చి వారు విని నేను వారి దోషమును వారి పాపమును క్షమించునట్లు తమ దుర్మార్గతను విడిచి పశ్చాత్తాపపడుదురేమో."
సంబంధిత రిఫరెన్స్‌లు
కాబట్టి నీవు వెళ్లి ఉపవాసదినమున యెహోవా మందిరములో ప్రజలకు వినబడునట్లు నేను చెప్పగా నీవు పుస్తకములో వ్రాసిన యెహోవా మాటలను చదివి వినిపించుము, తమ పట్టణములనుండి వచ్చు యూదా జనులందరికిని వినబడునట్లుగా వాటిని చదివి వినిపింపవలెను.
యెహూది మూడు నాలుగు పుటలు చదివిన తరువాత రాజు చాకుతో దాని కోసి కుంపటిలో వేయగా ఆ కుంపటిలో నున్న అగ్నిచేత అది బొత్తిగా కాలిపోయెను గాని
మరియు యూదా రాజైన యెహోయాకీమునుగూర్చి నీవీమాట చెప్పవలెను యెహోవా సెలవిచ్చునదేమనగా బబులోను రాజు నిశ్చయముగా వచ్చి యీ దేశమును పాడుచేసి అందులో మనుష్యులైనను జంతువులైనను ఉండకుండ చేయునని ఇందులో నీవేల వ్రాసితివని చెప్పి నీవు ఈ గ్రంథమును కాల్చివేసితివే;
ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు
యూదారాజును యోషీయా కుమారుడునైన యెహోయాకీము ఏలుబడియందు నాలుగవ సంవత్సరమున యిర్మీయా నోటిమాటనుబట్టి నేరీయా కుమారుడగు బారూకు గ్రంథములో ఈ మాటలు వ్రాయుచున్నప్పుడు ప్రవక్తయైన యిర్మీయా అతనితో చెప్పినది
యిర్మీయా బబులోనుమీదికి వచ్చు అపాయములన్నిటిని, అనగా బబులోనునుగూర్చి వ్రాయబడిన యీ మాటలన్నిటిని గ్రంథములొ వ్రాసెను.
అప్పుడు యెహోవా మోషేతో నిట్లనెను నేను అమాలేకీయుల పేరు ఆకాశముక్రింద నుండకుండ బొత్తిగా తుడిచివేయుదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంధములో దీని వ్రాసి యెహోషువకు వినిపించుము
ఈ ధర్మశాస్త్ర వాక్యములు మోషే గ్రంథమందు సాంతముగా వ్రాయుట ముగించిన తరువాత
మాదీయుల ప్రదేశమందు ఎగ్బతానా యను పురములో ఒక గ్రంథము దొరికెను. దానిలో వ్రాయబడియున్న యీ సంగతి కనబడెను.
నా మనవి వినుటకై నాకొకడు ఉండవలెనని నేనెంతో కోరుచున్నాను; ఇదిగో నా చేవ్రాలు గురుతు. ఇదిగో నా ప్రతివాది వ్రాసిన ఫిర్యాదు, సర్వశక్తుడు నాకుత్తరమిచ్చును గాక.
అప్పుడు పుస్తకపుచుట్టలో నన్నుగూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చియున్నాను.
మరియు యెహోవా నీవు గొప్ప పలక తీసికొని మహేరు షాలాల్, హాష్ బజ్1, అను మాటలు సామాన్యమైన అక్షరములతో దానిమీద వ్రాయుము.
రాబోవు దినములలో చిరకాలమువరకు నిత్యము సాక్ష్యార్థముగా నుండునట్లు నీవు వెళ్లి వారియెదుట పలకమీద దీని వ్రాసి గ్రంథములో లిఖింపుము
వారు తిరుగబడు జనులు అబద్ధమాడు పిల్లలు యెహోవా ధర్మశాస్త్రము విననొల్లని పిల్లలు
నరపుత్రుడా, వారు తిరుగుబాటు చేసినట్లు నీవు చేయక నేను నీతో చెప్పు మాటను విని నోరుతెరచి నేనిచ్చుదాని భుజించుము అనెను.
మరియు ఆయన నాతో ఈలాగు సెలవిచ్చెను నరపుత్రుడా, నీకు కనబడినదానిని భక్షించుము, ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలీయులయొద్దకు పోయి వారికి ప్రకటన చేయుము.
నేను నోరు తెరువగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి
నరపుత్రుడా, నేనిచ్చుచున్న యీ గ్రంథమును ఆహారముగా తీసికొని దానితో నీ కడుపు నింపుకొనుమని నాతో సెలవియ్యగా నేను దాని భక్షించితిని; అది నా నోటికి తేనెవలె మధురముగా నుండెను.
యెహోవా నాకీలాగు సెలవిచ్చెను చదువువాడు పరుగెత్తుచు చదువ వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలకమీద స్పష్టముగా వ్రాయుము.
ఆ దర్శనవిషయము నిర్ణయకాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దానికొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగుచేయక వచ్చును.
నేను మరల తేరిచూడగా ఎగిరిపోవు పుస్తకమొకటి నాకు కనబడెను.
నీకేమి కనబడుచున్నదని అతడు నన్నడుగగా నేను, ఇరువైమూరల నిడివియు పదిమూరల వెడల్పునుగల యెగిరిపోవు పుస్తకమొకటి నాకు కనబడుచున్నదంటిని.
అందుకతడు నాతో ఇట్లనెను ఇది భూమియంతటి మీదికి బయలువెళ్లు శాపమే; దానికి ఒక ప్రక్కను వ్రాసియున్న దానినిబట్టి దొంగిలువారందరును కొట్టివేయబడుదురు; రెండవ ప్రక్కను వ్రాసియున్న దానినిబట్టి అప్రమాణికులందరును కొట్టివేయబడుదురు.
ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు నేనే దాని బయలుదేరజేయుచున్నాను; అది దొంగల యిండ్లలోను, నా నామమునుబట్టి అబద్ధప్రమాణము చేయువారి యిండ్లలోను ప్రవేశించి వారి యిండ్లలో ఉండి వాటిని వాటి దూలములను రాళ్లను నాశనము చేయును.
మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి, యేడు ముద్రలు గట్టిగా వేసియున్న యొక గ్రంథము సింహాసనమునందు ఆసీసుడై యుండువాని కుడిచేత చూచితిని.
మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైనవాడెవడని బలిష్ఠుడైన యొక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని.
అయితే పరలోకమందుగాని భూమిమీదగాని భూమిక్రిందగాని ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికిని శక్తి లేకపోయెను.
ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడును కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా
ఆ పెద్దలలో ఒకడు ఏడువకుము; ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పెను.
మరియు సింహాసనమునకును ఆ నాలుగు జీవులకును పెద్దలకును మధ్యను, వధింపబడినట్లుండిన గొఱ్ఱపిల్ల నిలిచియుండుట చూచితిని. ఆ గొఱ్ఱపిల్లకు ఏడు కొమ్ములును ఏడు కన్నులు నుండెను. ఆ కన్నులు భూమియందంతటికి పంపబడిన దేవుని యేడు ఆత్మలు.
ఆయన వచ్చి సింహాసనమునందు ఆసీనుడై యుండువాని కుడిచేతిలో నుండి ఆ గ్రంథమును తీసికొనెను.
ఆయన దానిని తీసికొనినప్పుడు ఆ నాలుగు జీవులును, వీణలను, ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొనియున్న ఆ యిరువది నలుగురు పెద్దలును, ఆ గొఱ్ఱపిల్ల యెదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు.
ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసికొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడినవాడవై నీ రక్తమిచ్చి, ప్రతి వంశములోను, ఆ యా భాషలు మాటలాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను, దేవుని కొరకు మనుష్యులను కొని,
ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు
నేను అతని కొరకు నా ధర్మశాస్త్రమును పరిపూర్ణముగా వ్రాయించి నియమించినను వాటిని అతడు అన్యములుగా ఎంచెను.
యాకోబు ఇంటివారలారా, ఇశ్రాయేలు ఇంటివారలారా, మీరందరు యెహోవా వాక్కు వినుడి.
కావున వానలు కురియక మానెను, కడవరి వర్షము లేకపోయియున్నది, అయినను నీకు వ్యభిచార స్త్రీ ధైర్యమువంటి ధైర్యము గలదు, సిగ్గు పడనొల్లకున్నావు.
అయినను ఇప్పుడు నీవు నా తండ్రీ, చిన్నప్పటినుండి నాకు చెలికాడవు నీవేయని నాకు మొఱ్ఱపెట్టుచుండవా?
ఆయన నిత్యము కోపించునా? నిరంతరము కోపము చూపునా? అని నీవనుకొనినను నీవు చేయదలచిన దుష్కార్యములు చేయుచునే యున్నావు.
మరియు రాజైన యోషీయా దినములలో యెహోవా నాకీలాగు సెలవిచ్చెను ద్రోహినియగు ఇశ్రాయేలు చేయు కార్యము నీవు చూచితివా? ఆమె ఉన్నతమైన ప్రతి కొండమీదికిని పచ్చని ప్రతి చెట్టుక్రిందికిని పోవుచు అక్కడ వ్యభిచారము చేయుచున్నది.
ఆమె యీ క్రియలన్నిటిని చేసినను, ఆమెను నాయొద్దకు తిరిగిరమ్మని నేను సెలవియ్యగా ఆమె తిరిగిరాలేదు. మరియు విశ్వాసఘాతకురాలగు ఆమె సహోదరియైన యూదా దానిచూచెను.
ద్రోహినియగు ఇశ్రాయేలు వ్యభిచారముచేసిన హేతువుచేతనే నేను ఆమెను విడిచిపెట్టి ఆమెకు పరిత్యాగపత్రిక ఇయ్యగా, విశ్వాసఘాతకురాలగు ఆమె సహోదరియైన యూదా చూచియు తానును భయపడక వ్యభిచారము చేయుచు వచ్చుచున్నది.
రాళ్లతోను మొద్దులతోను వ్యభిచారము చేసెను; ఆమె నిర్భయముగా వ్యభిచారము చేసి దేశమును అపవిత్రపరచెను.
ఇంతగా జరిగినను విశ్వాసఘాతకురాలగు ఆమె సహోదరియైన యూదా పైవేషమునకే గాని తన పూర్ణహృదయముతో నాయొద్దకు తిరుగుటలేదని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
షోమ్రోను ప్రవక్తలు అవివేక క్రియలు చేయగా చూచితిని; వారు బయలు పేరట ప్రవచనము చెప్పి నా జనమైన ఇశ్రాయేలును త్రోవ తప్పించిరి.
యెరూషలేము ప్రవక్తలు ఘోరమైన క్రియలు చేయగా నేను చూచితిని, వారు వ్యభిచారులు అసత్య వర్తనులు, ఎవడును తన దుర్మార్గతనుండి మరలక దుర్మార్గుల చేతులను బలపరచుదురు, వారందరు నా దృష్టికి సొదొమవలెనైరి, దాని నివాసులు గొమొఱ్ఱావలెనైరి.
ఏలయనగా ఇశ్రాయేలువారును యూదావారును తమ బాల్యము మొదలుకొని నాయెదుట చెడుతనమే చేయుచు వచ్చుచున్నారు, తమ చేతుల క్రియవలన వారు నాకు కోపమే పుట్టించువారు; ఇదే యెహోవా వాక్కు.
నా కోపము రేపుటకు ఇశ్రాయేలువారును యూదావారును వారి రాజులును వారి ప్రధానులును వారి యాజకులును వారి ప్రవక్తలును యూదా జనులును యెరూషలేము నివాసులును చూపిన దుష్‌ప్రవర్తన అంతటినిబట్టి,
నా యెదుటనుండి వారి దుష్‌ప్రవర్తనను నేను నివారణచేయ ఉద్దేశించునట్లు, వారు ఈ పట్టణమును కట్టినదినము మొదలుకొని ఇదివరకును అది నాకు కోపము పుట్టించుటకు కారణమాయెను.
నేను పెందలకడ లేచి వారికి బోధించినను వారు నా బోధ నంగీకరింపకపోయిరి, వారు నా తట్టు ముఖము త్రిప్పుకొనక వీపునే త్రిప్పుకొనిరి.
మరియు నా పేరు పెట్టబడిన మందిరమును అపవిత్రపరచుటకు దానిలో హేయమైనవాటిని పెట్టిరి.
వారు తమ కుమారులను కుమార్తెలను ప్రతిష్టింపవలెనని బెన్ హిన్నోము లోయలోనున్న బయలునకు బలిపీఠములను కట్టించిరి, ఆలాగు చేయుటకు నేను వారి కాజ్ఞాపింపలేదు, యూదావారు పాపములో పడి, యెవరైన నిట్టి హేయక్రియలు చేయుదురన్నమాట నా కెన్నడును తోచలేదు.
కాబట్టి యెహోవా ఇశ్రాయేలువారియందు బహుగా కోపగించి, తన సముఖములోనుండి వారిని వెళ్లగొట్టెను గనుక యూదా గోత్రము గాక మరి యే గోత్రమును శేషించి యుండలేదు.
అయితే యూదావారును తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విడిచిపెట్టినవారై ఇశ్రాయేలువారు చేసికొనిన కట్టడలను అనుసరించిరి.
అంతట యెహోవా ఇశ్రాయేలువారి సంతతివారినందరిని విసర్జించి, వారిని శ్రమపెట్టి దోపుడుగాండ్ల చేతికప్పగించి, వారిని తన సముఖమునుండి వెళ్లగొట్టెను.
గర్భములో నేను నిన్ను రూపింపకమునుపే నిన్నెరిగితిని, నీవు గర్భమునుండి బయలుపడకమునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని.
పెల్లగించుటకును విరుగగొట్టుటకును, నశింపజేయుటకును పడద్రోయుటకును, కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యములమీదను నిన్ను నియమించియున్నాను.
ఈ దేశముమీదికిని దీని నివాసులమీదికిని చుట్టునున్న యీ జనులందరి మీదికిని వారిని రప్పించుచున్నాను; ఈ జనులను శాపగ్రస్తులగాను విస్మయాస్పదముగాను అపహాస్యాస్పదముగాను ఎప్పటికిని పాడుగాను ఉండజేసెదను.
సంతోషనాదమును ఉల్లాస శబ్దమును, పెండ్లికుమారుని స్వరమును పెండ్లికుమార్తె స్వరమును తిరుగటిరాళ్ల ధ్వనిని దీపకాంతిని వారిలో ఉండకుండ చేసెదను.
ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును; ఈ జనులు డెబ్బది సంవత్సరములు బబులోను రాజునకు దాసులుగా ఉందురు.
యెహోవా వాక్కు ఇదే డెబ్బది సంవత్సరములు గడచిన తరువాత వారి దోషములనుబట్టి నేను బబులోను రాజును ఆ జనులను కల్దీయుల దేశమును శిక్షింతును; ఆ దేశము ఎప్పుడు పాడుగనుండునట్లు నియమింతును.
నేను ఆ దేశమునుగూర్చి సెలవిచ్చిన మాటలన్నియు యిర్మీయా ఈ జనములన్నిటినిగూర్చి ప్రకటింపగా, ఈ గ్రంథములో వ్రాయబడినదంతయు ఆ దేశముమీదికి రప్పించెదను.
ఏలయనగా నేను వారి క్రియలనుబట్టియు వారి చేతి కార్యములనుబట్టియు వారికి ప్రతికారముచేయునట్లు అనేక జనములును మహారాజులును వారిచేత సేవ చేయించుకొందురు.
ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నాకీలాగు సెలవిచ్చుచున్నాడు నీవు ఈ క్రోధపు మద్యపాత్రను నాచేతిలోనుండి తీసికొని, నేను నిన్ను పంపుచున్న జనములన్నిటికి దాని త్రాగింపుము.
వారు దాని త్రాగి సొక్కి సోలుచు నేను వారిమీదికి పంపుచున్న ఖడ్గమునుబట్టి వెఱ్ఱివాండ్రగుదురు.
అంతట యెహోవా చేతిలోనుండి నేను ఆ పాత్రను తీసికొని, యెహోవా నన్ను పంపిన జనములన్నిటికి దాని త్రాగించితిని.
నేటివలెనే పాడుగాను నిర్జనముగాను అపహాస్యాస్పదముగాను శాపాస్పదముగాను చేయుటకు యెరూషలేమునకును యూదా పట్టణములకును దాని మహారాజులకును దాని అధిపతులకును త్రాగించితిని.
మరియు ఐగుప్తు రాజైన ఫరోయును అతని దాసులును అతని ప్రధానులును అతని జనులందరును
సమస్తమైన మిశ్రిత జనులును ఊజు దేశపు రాజులందరును ఫిలిష్తీయుల దేశపు రాజులందరును అష్కెలోనును, గాజయును, ఎక్రోనును అష్డోదు శేషపువారును
ఎదోమీయులును మోయాబీయులును అమ్మోనీయులును
తూరు రాజులందరును సీదోను రాజులందరును సముద్రమునకు ఆవలి ద్వీపపు రాజులును
దదానీయులును తేమానీయులును బూజీయులును గడ్డపుప్రక్కలను కత్తిరించుకొనువారందరును
అరబిదేశపు రాజులందరును అరణ్యములో నివసించు మిశ్రితజనముల రాజులందరును
జిమీ రాజులందరును ఏలాము రాజులందరును మాదీయుల రాజులందరును
సమీపమున ఉన్నవారేమి దూరమున ఉన్నవారేమి ఉత్తరదేశముల రాజులందరును భూమిమీదనున్న రాజ్యములన్నియు దానిలోనిది త్రాగుదురు; షేషకు రాజు వారి తరువాత త్రాగును.
నీవు వారితో ఈలాగు చెప్పుము ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను మీమీదికి పంపబోవు యుద్ధముచేత త్రాగి మత్తిల్లి కక్కుకొనినవారివలెనే యుండి మీరు మరల లేవకుండ పడుదురు.
మేము త్రాగమని వారు నీచేతిలోనుండి ఆ పాత్రను తీసికొననొల్లనియెడల నీవు వారితో ఇట్లనుము మీరు అవశ్యముగా దాని త్రాగవలెనని సైన్యములకధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.
నా పేరు పెట్టబడిన పట్టణమునకు నేను కీడుచేయ మొదలుపెట్టగా మీకు శిక్షలేకుండ పోవునా? మీరు శిక్షింపబడకపోరు. భూలోక నివాసులందరిమీదికి నేను ఖడ్గమును రప్పించుచున్నాను; ఇదే సైన్యములకధిపతియగు యెహోవా వాక్కు.
ఫరో గాజాను కొట్టకమునుపు ఫిలిష్తీయులనుగూర్చి ప్రవక్తయైన యిర్మీయాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు
నేను దానిమీదికి రప్పింపబోవుచున్న అపాయములచేత బబులోను మరల పైకి రాలేక ఆలాగే మునిగిపోవును, దాని జనులు అలసియుందురు అను మాటలు నీవు ప్రకటింపవలెను. యిర్మీయాయొక్క మాటలు ఇంతటితో ముగిసెను.
ఆమోను కుమారుడైన యోషీయా యూదాకు రాజైయుండగా అతని యేలుబడి పదుమూడవ సంవత్సరమున యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమాయెను.
మరియు యోషీయా కుమారుడగు యెహోయాకీము యూదాకు రాజైయుండగాను, యోషీయా కుమారుడగు సిద్కియా యూదాకు రాజైయుండగాను, అతని యేలుబడి పదునొకండవ సంవత్సరాంతమువరకును, అనగా ఆ సంవత్సరమున అయిదవ నెలలో యెరూషలేము చెరదీసికొని పోబడువరకును ఆ వాక్కు ప్రత్యక్షమగుచుండెను.
ఆమోను కుమారుడును యూదా రాజునైన యోషీయా పదుమూడవ సంవత్సరము మొదలుకొని నేటివరకు ఈ యిరువది మూడు సంవత్సరములు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమగుచు వచ్చెను; నేను పెందలకడ లేచి మీకు ఆ మాటలు ప్రకటించుచు వచ్చినను మీరు వినకపోతిరి.
అంతట ప్రవక్తయైన ఏలీయా యొక పత్రిక వ్రాసి అతనియొద్దకు పంపెను నీ పితరుడగు దావీదునకు దేవుడైన యెహోవా సెలవిచ్చునదేమనగా నీవు నీ తండ్రియైన యెహోషాపాతు మార్గములందైనను యూదారాజైన ఆసా మార్గములందైనను నడువక
అప్పుడు రాజైన దర్యావేషు ఆజ్ఞ ఇచ్చినందున బబులోనులో ఖజానాలోని దస్తావేజు కొట్టులో వెదకగా
ప్రధానులందరు కూషీకి ఇనుమనుమడును షెలెమ్యాకు మనుమడును నెతన్యాకు కుమారుడునైన యెహూదిని బారూకు నొద్దకు పంపి నీవు ప్రజల వినికిడిలో చదివిన పుస్తకమును చేతపట్టుకొని రమ్మని ఆజ్ఞ నియ్యగా నేరీయా కుమారుడగు బారూకు ఆ గ్రంథమును చేతపట్టుకొని వచ్చెను.
బారూకు అతడు నోటనుండియే యీ మాటలన్నిటిని పలుకగా నేను పుస్తకములో వాటిని సిరాతో వ్రాసితినని వారితో ఉత్తరమిచ్చెను.
ఆయన నాతో ఇట్లనెను నరపుత్రుడా, నామీద తిరుగుబాటు చేసిన జనులయొద్దకు ఇశ్రాయేలీయులయొద్దకు నిన్ను పంపుచున్నాను; వారును వారి పితరులును నేటివరకును నామీద తిరుగుబాటు చేసినవారు.
మీరు మీ పితరులవంటివారై యుండవద్దు; పూర్వికులైన ప్రవక్తలు సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా మీ దుర్మార్గతను మీ దుష్‌క్రియలను మాని తిరుగుడని వారికి ప్రకటించినను వారు వినకపోయిరి, నా మాట ఆలకించకపోయిరి; ఇదే యెహోవా వాక్కు.
యెరూషలేములోను దాని చుట్టును పట్టణములలోను దక్షిణ దేశములోను మైదానములోను జనులు విస్తరించి క్షేమముగా ఉన్నకాలమున పూర్వికులగు ప్రవక్తల ద్వారా యెహోవా ప్రకటన చేసిన ఆజ్ఞలను మీరు మనస్సునకు తెచ్చుకొనకుండవచ్చునా?