లేఖనాలను అన్వేషించండి

యిర్మియా 38: 26

క్రాస్-రిఫరెన్స్‌లు

" నీవు యోనాతాను ఇంటిలో నేను చనిపోకుండ అక్కడికి నన్ను తిరిగి వెళ్లనంపవద్దని రాజు ఎదుట నేను మనవి చేసికొనబోతినని వారితో చెప్పుమని రాజు యిర్మీయాతో అనెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

యిర్మియా 38:4

ఇతడు ఇట్టి సమాచారము వారికి ప్రకటన చేయుటవలన ఈ పట్టణములో నిలిచియున్న యోధుల చేతులను ప్రజలందరి చేతులను బలహీనము చేయుచున్నాడు; చిత్తగించి వానికి మరణశిక్ష విధింపుము.

యిర్మియా 38:5

అందుకు రాజైన సిద్కియా అతడు మీవశమున ఉన్నాడు, రాజు మీకు అడ్డము రాజాలడనగా

యిర్మియా 38:6

వారు యిర్మీయాను పట్టుకొని కారాగృహములోనున్న రాజకుమారుడగు మల్కీయా గోతిలోనికి దింపిరి. అందులోనికి యిర్మీయాను త్రాళ్లతో దింపినప్పుడు ఆ గోతిలో నీళ్లు లేవు, బురద మాత్రమే యుండెను, ఆ బురదలో యిర్మీయా దిగబడెను.

యిర్మియా 38:27

అంతట అధిపతులందరు యిర్మీయాయొద్దకు వచ్చి యడుగగా అతడు రాజు సెలవిచ్చిన మాటల ప్రకారముగా వారికుత్తరమిచ్చి ఆ సంగతి వారికి తెలియజేయనందున వారు అతనితో మాటలాడుట మానిరి.

2సమూయేలు 14:18

రాజునేను నిన్ను అడుగు సంగతి నీ వెంతమాత్రమును మరుగు చేయవద్దని ఆ స్త్రీతో అనగా ఆమె నా యేలినవాడవగు నీవు సెలవిమ్మనెను.