యిర్మియా 40: 10
క్రాస్-రిఫరెన్స్‌లు
" నేనైతేనో నాయొద్దకు వచ్చు కల్దీయుల యెదుట నిలుచుటకై మిస్పాలో కాపురముందును గాని మీరు ద్రాక్షారసమును వేసవికాల ఫలములను తైలమును సమకూర్చుకొని, మీ పాత్రలలో వాటిని పోసికొని మీరు స్వాధీనపరచుకొనిన పట్టణములలో కాపురముండుడి."
సంబంధిత రిఫరెన్స్‌లు
ఈలాగున యెహోవా దావీదుయొక్క శత్రువులచేత దాని విచారించునట్లుగా యోనాతాను దావీదు సంతతివారిని బట్టి నిబంధన చేసెను.
యోనాతాను దావీదును తన ప్రాణస్నేహితునిగా ప్రేమించెను గనుక ఆ ప్రేమనుబట్టి దావీదుచేత మరల ప్రమాణము చేయించెను.
గెదల్యా వారితోను వారి జనులతోను ప్రమాణముచేసి కల్దీయులకు మనము దాసులమైతిమని జడియవద్దు, దేశమందు కాపురముండి బబులోను రాజునకు మీరు సేవచేసినయెడల మీకు మేలు కలుగునని చెప్పెను.
అయితే ఏ జనులు బబులోను రాజు కాడి క్రిందికి తమ మెడను వంచి అతనికి దాస్యము చేయుదురో ఆ జనులను తమ దేశములో కాపురముండనిచ్చెదను. వారు తమ భూమిని సేద్య పరచుకొందురు, నేను వారికి నెమ్మది కలుగజేతును; ఇదే యెహోవా వాక్కు.
అప్పుడు యిర్మీయా సిద్కియాతో ఇట్లనెను దేవుడు, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నీవు బబులోనురాజు అధిపతులయొద్దకు వెళ్లినయెడల నీవు బ్రదికెదవు, ఈపట్టణము అగ్నిచేత కాల్చబడదు, నీవును నీ యింటివారును బ్రదుకుదురు.
అయితే నీవు బబులోను అధిపతులయొద్దకు వెళ్లనియెడల ఈ పట్టణము కల్దీయులచేతికి అప్పగింపబడును, వారు అగ్నిచేత దాని కాల్చివేసెదరు, మరియు నీవు వారి చేతిలోనుండి తప్పించుకొనజాలవు.
అందుకు రాజైన సిద్కియా యిర్మీయాతో ఇట్లనెను కల్దీయుల పక్షముగా ఉండు యూదులకు భయపడుచున్నాను; ఒకవేళ కల్దీయులు నన్ను వారిచేతికి అప్పగించినయెడల వారు నన్ను అపహసించెదరు.
అందుకు యిర్మీయా వారు నిన్నప్పగింపరు, నీవు బ్రదికి బాగుగానుండునట్లు నేను నీతో చెప్పుచున్న సంగతినిగూర్చి యెహోవా సెలవిచ్చు మాటను చిత్తగించి ఆలకించుము.
అతడు విశ్రాంతి మంచిదగుటయు ఆ భూమి రమ్యమైనదగుటయు చూచెను గనుక అతడు మోయుటకు భుజము వంచుకొని వెట్టిచేయు దాసుడగును.
యెహోవాయందు నమ్మికయుంచి మేలుచేయుము దేశమందు నివసించి సత్యము ననుసరించుము
నిశ్చయముగా నీవు నీచేతుల కష్టార్జితము ననుభవించెదవు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును.
ఆయన నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్లుటకు భయపడకుము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసెదను.
హిల్కీయాకును, షాఫాను కుమారుడైన అహీకాముకును, మీకా కుమారుడైన అబ్దోనుకును, శాస్త్రియగు షాఫానుకును, రాజు సేవకుడైన ఆశాయాకును ఈలాగున ఆజ్ఞ ఇచ్చెను
ఏ జనము ఏ రాజ్యము బబులోను రాజైన నెబుకద్రెజరునకు దాస్యము చేయనొల్లక బబులోను రాజుయొక్క కాడిని తన మెడమీద పెట్టుకొనదో దానిని నేను అతనిచేత బొత్తిగా నాశనము చేయించువరకు ఆ జనమును ఖడ్గముచేతను క్షామముచేతను తెగులుచేతను శిక్షించెదను; ఇదే యెహోవా వాక్కు.
ఎడారిజనుల ఖడ్గభయమువలన ప్రాణమునకు తెగించి మా ధాన్యము తెచ్చుకొనుచున్నాము.
అతడు ఈ సంగతులనుగూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడవైన యోసేపూ, నీ భార్యయైన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించునది పరిశుద్దాత్మవలన కలిగినది; ఆమె యొక కుమారుని కనును;