యిర్మియా 46: 13
క్రాస్-రిఫరెన్స్‌లు
" బబులోనురాజైన నెబుకద్రెజరు బయలుదేరి వచ్చి ఐగుప్తీయులను హతము చేయుటనుగూర్చి యిర్మీయాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. "
సంబంధిత రిఫరెన్స్‌లు
నీవు ఎరుగని దేశములలోనికి నేను నిన్ను వెళ్లగొట్టి, జనములలో నీకు సమూలధ్వంసము కలుగజేసి బహు జనములకు కోపము పుట్టింతును,
నా ఖడ్గమును నేను వారిమీద ఝళిపించెదను, నిన్నుబట్టి చాలమంది జనులు కలవరించుదురు, వారి రాజులును నిన్నుబట్టి భీతులగుదురు, నీవు కూలు దినమున వారందరును ఎడతెగక ప్రాణభయముచేత వణకుదురు.
ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా బబులోనురాజు ఖడ్గము నీమీదికి వచ్చును,
శూరుల ఖడ్గములచేత నేను నీ సైన్యమును కూల్చెదను, వారందరును జనములలో భయంకరులు; ఐగుప్తీయుల గర్వము నణచివేయగా దాని సైన్యమంతయు లయమగును.
సముద్రమే తనకు ఆపుగాను సముద్రమే తనకు ప్రాకారముగాను చేసికొని, బహు జనములచేత చుట్టబడి నైలునది దగ్గర నుండిన నోఅమోను పట్టణముకంటె నీవు విశేషమైన దానవా?
కూషీయులును ఐగుప్తీయులును దాని శూరులైరి, వారు విస్తారజనముగా నుండిరి, పూతువారును లూబీయులును నీకు సహాయులైయుండిరి.
అయినను అది చెరపట్టబడి కొనిపోబడెను, రాజమార్గముల మొగలయందు శత్రువులు దానిలోని చిన్నపిల్లలను బండలకు వేసి కొట్టి చంపిరి, దాని ఘనులమీద చీట్లువేసి దాని ప్రధానుల నందరిని సంకెళ్లతో బంధించిరి.
యూదా దుఃఖించుచున్నది, దాని గుమ్మములు అంగలార్చుచున్నవి, జనులు విచారగ్రస్తులై నేలకు వంగుదురు, యెరూషలేము చేయు అంగలార్పు పైకెక్కుచున్నది.
నిమీములో నీళ్లు సహితము ఎండిపోయెను హెష్బోను మొదలుకొని ఏలాలేవరకును యాహసు వరకును సోయరు మొదలుకొని హొరొనయీము వరకును ఎగ్లాత్షాలిషా వరకును జనులు కేకలువేయుచున్నారు.
వారు పడిపోగా అఖండమైన ధ్వని పుట్టెను; భూమి దానికి దద్దరిల్లుచున్నది, అంగలార్పు ఘోషయు ఎఱ్ఱసముద్రము దనుక వినబడెను.
ఆలకించుడి, బబులోనులోనుండి రోదనధ్వని వినబడుచున్నది కల్దీయుల దేశములో మహా నాశనధ్వని వినబడుచున్నది.
చావక మిగిలియున్నవారు గడ్డల రోగముచేత మొత్తబడిరి. ఆ పట్టణస్థుల కేకలు ఆకాశమువరకు వినబడెను.
మోయాబు నిమిత్తము నా హృదయము అరచుచున్నది దాని ప్రధానులు మూడేండ్ల తరిపి దూడవలె సోయరు వరకు పారిపోవుదురు లూహీతు ఎక్కుడు త్రోవను ఏడ్చుచు ఎక్కుదురు నశించితిమేయని యెలుగెత్తి కేకలువేయుచు హొరొనయీము త్రోవను పోవుదురు.
ఏలయనగా నిమీము నీటి తావులు ఎడారులాయెను అది ఇంకను అడవిగా ఉండును. గడ్డి యెండిపోయెను, చెట్టు చేమలు వాడబారుచున్నవి పచ్చనిది ఎక్కడను కనబడదు
ఒక్కొకడు సంపాదించిన ఆస్తిని తాము కూర్చుకొనిన పదార్థములను నిరవంజి చెట్లున్న నది అవతలకు వారు మోసికొనిపోవుదురు.
రోదనము మోయాబు సరిహద్దులలో వ్యాపించెను అంగలార్పు ఎగ్లయీమువరకును బెయేరేలీమువరకును వినబడెను.
ఆ దినమందు మత్స్యపు గుమ్మములో రోదన శబ్దమును, పట్టణపు దిగువ భాగమున అంగలార్పును వినబడును, కొండల దిక్కునుండి గొప్ప నాశనము వచ్చును. ఇదే యెహోవా వాక్కు.
త్వరగ పరుగెత్తువారు పారిపోజాలకున్నారు బలాఢ్యులు తప్పించుకొనజాలకున్నారు ఉత్తరదిక్కున యూఫ్రటీసు నదీతీరమందు వారు తొట్రిల్లిపడుచున్నారు.
వారు చెరపట్టబడినవారి క్రింద దాగుకొనుచున్నారు హతులైనవారి క్రింద కూలుచున్నారు ఈలాగు జరిగినను యెహోవా కోపము చల్లారలేదు ఆయన బాహువు ఇంకను చాపబడియున్నది.
నేను ఐగుప్తీయులమీదికి ఐగుప్తీయులను రేపెదను సహోదరులమీదికి సహోదరులు పొరుగువారిమీదికి పొరుగువారు లేచుదురు పట్టణముతో పట్టణము యుద్ధము చేయును రాజ్యముతో రాజ్యము యుద్ధము చేయును
రాజు తన పరాక్రమశాలురను జ్ఞాపకము చేసికొనగా వారు నడుచుచు పడిపోవుదురు, ప్రాకారమునకు పరుగెత్తి వచ్చి మ్రాను సిద్ధపరచుదురు.