లేఖనాలను అన్వేషించండి

యిర్మియా 48: 44

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఇదే యెహోవా వాక్కు. భయము తప్పించుకొనుటకై పారిపోవువారు గుంటలో పడుదురు గుంటలోనుండి తప్పించుకొనువారు ఉరిలో చిక్కుకొందురు మోయాబుమీదికి విమర్శ సంవత్సరమును నేను రప్పించుచున్నాను ఇదే యెహోవా వాక్కు. దేశ పరిత్యాగులగువారు బలహీనులై హెష్బోను నీడలో నిలిచియున్నారు. "

సంబంధిత రిఫరెన్స్‌లు

ద్వితియోపదేశాకాండము 32:23

వారికి ఆపదలను విస్తరింపజేసెదను వారిమీద నా బాణములన్నిటిని వేసెదను.

ద్వితియోపదేశాకాండము 32:24

వారు కరవుచేత క్షీణించుదురు మంటచేతను క్రూరమైన హత్యచేతను హరించిపోవుదురు బురదలో ప్రాకు పాముల విషమును మృగముల కోరలను వారిమీదికి రప్పించెదను.

ద్వితియోపదేశాకాండము 32:25

బయట ఖడ్గమును లోపట భయమును యౌవనులను కన్యకలను శిశువులను నెరిసిన తలవెండ్రుకలు గలవారిని నశింపజేయును.

కీర్తనలు 11:6

దుష్టులమీద ఆయన ఉరులు కురిపించును అగ్నిగంధకములును వడగాలియు వారికి పానీయభాగమగును.

యెషయా 24:17

భూ నివాసీ, నీమీదికి భయము వచ్చెను గుంటయు ఉరియు నీకు తటస్థించెను

యెషయా 24:18

తూములు పైకి తీయబడియున్నవి భూమి పునాదులు కంపించుచున్నవి

విలాపవాక్యములు 3:47

భయమును గుంటయు పాడును నాశనమును మాకు తటస్థించినవి.

యోబు 20:24

ఇనుప ఆయుధము తప్పించుకొనుటకై వారు పారిపోగా ఇత్తడివిల్లు వారి దేహములగుండ బాణములను పోవిడుచును.

యెషయా 15:9

ఏలయనగా దీమోను జలములు రక్తములాయెను. మరియు నేను దీమోనుమీదికి ఇంకొకబాధను రప్పించెదను. మోయాబీయులలోనుండి తప్పించుకొనినవారి మీదికిని ఆ దేశములో శేషించినవారి మీదికిని సింహమును రప్పించెదను.

యెహెజ్కేలు 15:7

నేను వారిమీద కఠినదృష్టి నిలుపుదును, వారు అగ్నిని తప్పించుకొనినను అగ్నియే వారిని దహించును; వారియెడల నేను కఠినదృష్టి గలవాడనై యుండగా నేనే యెహోవానని మీరు తెలిసికొందురు.

ఆమోసు 5:19

ఒకడు సింహము నొద్దనుండి తప్పించుకొనగా ఎలుగుబంటి యెదురైనట్టు, వాడు ఇంటిలోనికి పోయి గోడమీద చెయ్యివేయగా పాము వాని కరచినట్టు ఆ దినముండును.

లూకా 21:35

ఆ దినము భూమియందంతట నివసించు వారందరిమీదికి అకస్మాత్తుగా వచ్చును.