లేఖనాలను అన్వేషించండి

యిర్మియా 50: 17

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఇశ్రాయేలువారు చెదిరిపోయిన గొఱ్ఱలు సింహములు వారిని తొలగగొట్టెను మొదట అష్షూరురాజు వారిని భక్షించెను కడపట బబులోను రాజైన యీ నెబుకద్రెజరు వారి యెముకలను నలుగగొట్టుచున్నాడు. "

సంబంధిత రిఫరెన్స్‌లు

యిర్మియా 51:23

నీవలన గొఱ్ఱలకాపరులను వారి గొఱ్ఱలమందలను విరుగగొట్టుచున్నాను నీవలన దున్నువారిని వారి దుక్కిటెద్దులను విరుగగొట్టుచున్నాను నీవలన ఏలికలను అధిపతులను విరుగగొట్టుచున్నాను.

యోవేలు 1:11

భూమిమీది పైరు చెడిపోయెను గోధుమ కఱ్ఱలను యవల కఱ్ఱలను చూచి సేద్యగాండ్లారా, సిగ్గునొందుడి. ద్రాక్షతోట కాపరులారా, రోదనము చేయుడి.

ఆమోసు 5:16

దేవుడును సైన్యములకధిపతియునైన ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా నేను మీ మధ్య సంచరింప బోవుచున్నాను గనుక రాజమార్గములన్నిటిలో అంగలార్పు వినబడును, వీధులన్నిటిలో జనులు కూడి అయ్యో శ్రమ అందురు; అంగలార్చుటకు వారు సేద్యగాండ్రను పిలుతురు; రోదనముచేయ నేర్పుగలవారిని అంగలార్చుటకు పిలిపింతురు.

యిర్మియా 46:16

ఆయన అనేకులను తొట్రిల్లజేయుచున్నాడు వారొకనిమీద ఒకడు కూలుచు లెండి, క్రూరమైన ఖడ్గమును తప్పించుకొందము రండి మన స్వజనులయొద్దకు మన జన్మభూమికి వెళ్లుదము రండి అని వారు చెప్పుకొందురు.

యిర్మియా 51:9

మనము బబులోనును స్వస్థపరచగోరితివిు అయితే అది స్వస్థత నొందలేదు దాని విడిచిపెట్టుడి. మన మన దేశములకు వెళ్లుదము రండి దాని శిక్ష ఆకాశమంత యెత్తుగా సాగుచున్నది అది మేఘములంత ఉన్నతముగా ఎక్కుచున్నది

యెషయా 13:14

అప్పుడు తరుమబడుచున్న జింకవలెను పోగుచేయని గొఱ్ఱలవలెను జనులు తమ తమ స్వజనులతట్టు తిరుగుదురు తమ తమ స్వదేశములకు పారిపోవుదురు.

నహూము 2:8

కట్టబడినప్పటినుండి నీనెవె పట్టణము నీటికొలనువలె ఉండెను; దాని జనులు పారిపోవుచున్నారు; నిలువుడి నిలువుడి అని పిలిచినను తిరిగిచూచు వాడొకడును లేడు.