లేఖనాలను అన్వేషించండి

యిర్మియా 51: 53

క్రాస్-రిఫరెన్స్‌లు

" బబులోను తన బలమైన ఉన్నత స్థలములను దుర్గములుగా చేసికొని ఆకాశమునకు ఎక్కినను పాడుచేయువారు నాయొద్దనుండి వచ్చి దానిమీద పడుదురు ఇదే యెహోవా వాక్కు. "

సంబంధిత రిఫరెన్స్‌లు

యిర్మియా 51:47

రాబోవు దినములలో నేను బబులోనుయొక్క చెక్కిన విగ్రహములను శిక్షింతును దాని దేశమంతయు అవమానము నొందును జనులు హతులై దాని మధ్యను కూలెదరు

యిర్మియా 50:38

నీళ్లకు ఎద్దడి తగులును అవి ఇంకిపోవును అది చెక్కబడిన విగ్రహములుగల దేశము జనులు భీకర ప్రతిమలనుబట్టి పిచ్చిచేష్టలు చేయుదురు.

యెషయా 13:15

పట్టబడిన ప్రతివాడును కత్తివాత కూలును తరిమి పట్టబడిన ప్రతివాడును కత్తివాత కూలును

యెషయా 13:16

వారు చూచుచుండగా వారి పసిపిల్లలు నలుగగొట్టబడుదురు వారి యిండ్లు దోచుకొనబడును వారి భార్యలు చెరుపబడుదురు.

యెహెజ్కేలు 30:24

మరియు బబులోను రాజుయొక్క చేతులను బలపరచి నా ఖడ్గము అతని చేతికిచ్చెదను, ఫరోయొక్క చేతులను నేను విరిచినందున బబులోనురాజు చూచుచుండగా ఫరో చావుదెబ్బ తినినవాడై మూల్గులిడును.

దానియేలు 5:30

ఆ రాత్రియందే కల్దీయుల రాజగు బెల్షస్సరు హతుడాయెను.

దానియేలు 5:31

మాదీయుడగు దర్యావేషు అరువది రెండు సంవత్సరముల వాడై సింహాసనము నెక్కెను.

యెషయా 21:9

ఇదిగో జతజతలుగా రౌతుల దండు వచ్చుచున్నది అని చెప్పెను. బబులోను కూలెను కూలెను దాని దేవతల విగ్రహములన్నిటిని ఆయన నేలను పడవేసియున్నాడు ముక్కముక్కలుగా విరుగగొట్టియున్నాడు అనిచెప్పుచు వచ్చెను.

యెషయా 46:1

బేలు కూలుచున్నది నెబో క్రుంగుచున్నది వాటి ప్రతిమలు జంతువులమీదను పశువులమీదను మోయబడుచున్నవి

యిర్మియా 50:2

జనములలో ప్రకటించుడి సమాచారము తెలియజేయుడి ధ్వజమునెత్తి మరుగుచేయక చాటించుడి బబులోను పట్టబడును బేలు అవమానము నొందును మెరోదకు నేల పడవేయబడును బబులోను విగ్రహములు అవమానము నొందును దాని బొమ్మలు బోర్లద్రోయబడును

లూకా 10:30

అందుకు యేసు ఇట్లనెను ఒక మనుష్యుడు యెరూషలేమునుండి యెరికో పట్టణమునకు దిగివెళ్లుచు దొంగల చేతిలో చిక్కెను; వారు అతని బట్టలు దోచుకొని, అతని కొట్టి కొరప్రాణముతో విడిచిపోయిరి