లేఖనాలను అన్వేషించండి

యోబు 1: 16

క్రాస్-రిఫరెన్స్‌లు

" అతడు ఇంక మాటలాడుచుండగా మరియొకడు వచ్చి దేవుని అగ్ని ఆకాశమునుండి పడి గొఱ్ఱలను పనివారిని రగులబెట్టి కాల్చివేసెను; దానిని నీకు తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చియున్నాననెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

ఆదికాండము 19:24

అప్పుడు యెహోవా సొదొమమీదను గొమొఱ్ఱామీదను యెహోవాయొద్దనుండి గంధకమును అగ్నిని ఆకాశమునుండి కురిపించి

లేవీయకాండము 9:24

యెహోవా సన్నిధినుండి అగ్ని బయలువెళ్లి బలిపీఠము మీదనున్న దహనబలి ద్రవ్యమును క్రొవ్వును కాల్చివేసెను; ప్రజలందరు దానిని చూచి ఉత్సాహధ్వని చేసి సాగిలపడిరి.

1రాజులు 18:38

అతడు ఈలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి, దహనబలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోచేసెను.

2రాజులు 1:10

అందుకు ఏలీయా నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశమునుండి దిగివచ్చి నిన్ను నీ యేబదిమందిని దహించును గాక అని యేబదిమందికి అధిపతియైన వానితో చెప్పగా, అగ్ని ఆకాశమునుండి దిగి వానిని వాని యేబదిమందిని దహించెను.

2రాజులు 1:12

అందుకు ఏలీయా నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశమునుండి దిగివచ్చి నిన్ను నీ యేబదిమందిని దహించును గాక అని చెప్పగా, ఆకాశమునుండి దేవుని అగ్ని దిగి వానిని వాని యేబదిమందిని దహించెను.

2రాజులు 1:14

చిత్తగించుము; ఆకాశమునుండి అగ్ని దిగి వెనుకటి పంచ దశాధిపతులను ఇద్దరిని వాని వాని యేబదిమందితో కూడ దహించెను; అయితే నా ప్రాణము నీ దృష్టికి ప్రియమైనదిగా ఉండనిమ్మని మనవిచేయగా

ఆమోసు 7:4

మరియు అగ్నిచేత దండింపవలెనని అగ్ని రప్పించి ప్రభువైన యెహోవా దానిని దర్శనరీతిగా నాకు కనుపరచెను. అదివచ్చి అగాధమైన మహాజలమును మింగివేసి, స్వాస్థ్యమును మింగ మొదలుపెట్టినప్పుడు

ప్రకటన 13:13

అది ఆకాశమునుండి భూమికి మనుష్యుల యెదుట అగ్ని దిగివచ్చునట్టుగా గొప్ప సూచనలు చేయుచున్నది.

నిర్గమకాండము 9:28

ఇంతమట్టుకు చాలును; ఇకను బ్రహ్మాండమైన ఉరుములు వడగండ్లు రాకుండునట్లు యెహోవాను వేడుకొనుడి, మిమ్మును పోనిచ్చెదను, మిమ్మును ఇకను నిలుపనని వారితో చెప్పగా

1సమూయేలు 14:15

దండులోను పొలములోను జనులందరిలోను మహా భయకంపము కలిగెను. దండు కావలివారును దోపుడుగాండ్రును భీతినొందిరి; నేలయదిరెను. వారు ఈ భయము దైవికమని భావించిరి.

ఆదికాండము 34:28

వారి గొఱ్ఱలను పశువులను గాడిదలను ఊరిలోనిదేమి పొలములోనిదేమి

సంఖ్యాకాండము 11:1

జనులు ఆయాసమునుగూర్చి సణుగుచుండగా అది యెహోవాకు వినబడెను; యెహోవా దాని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను; యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాళెములో నొకకొనను దహింపసాగెను.

1రాజులు 1:22

ఆమె రాజుతో మాటలాడుచున్నప్పుడు ప్రవక్తయగు నాతానును లోపలికిరాగా ప్రవక్తయగు నాతాను వచ్చియున్నాడని సేవకులు రాజునకు తెలియజేసిరి.

యోబు 1:15

ఖడ్గముతో పనివారిని హతముచేసిరి. జరిగినది నీకు తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చియున్నాననెను.

యోబు 19:16

నేను నా పనివాని పిలువగా వాడేమి పలుకకుండనున్నాడు నేను వాని బతిమాలవలసి వచ్చెను.

యోబు 22:20

నీతిమంతులు దాని చూచి సంతోషించుదురు నిర్దోషులు వారిని హేళన చేయుదురు.

ఎఫెసీయులకు 2:2

మీరు వాటిని చేయుచు, వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి, యీ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి.