యోబు 1: 17
క్రాస్-రిఫరెన్స్‌లు
" అతడు ఇంక మాటలాడుచుండగా మరియొకడు వచ్చి కల్దీయులు మూడు సమూహములుగా వచ్చి ఒంటెలమీద పడి వాటిని కొనిపోయి ఖడ్గముచేత పనివారిని చంపిరి; నీకు దానిని తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చియున్నాననెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
హారాను తాను పుట్టిన దేశమందలి కల్దీయుల ఊరను పట్టణములో తన తండ్రియైన తెరహు కంటె ముందుగా మృతిబొందెను.
ఇదిగో కల్దీయుల దేశమును చూడుము వారికను జనముగా ఉండరు అష్షూరీయులు దానిని అడవిమృగములకు నివాసముగా చేసియున్నారు. వారు కోటలు కట్టించి దాని నగరులను పడగొట్టియున్నారు.
ఆలకించుడి, తమవికాని ఉనికిపట్టులను ఆక్రమించవలెనని భూదిగంతములవరకు సంచరించు ఉద్రేకముగల క్రూరులగు కల్దీయులను నేను రేపుచున్నాను.
ఖడ్గముతో పనివారిని హతముచేసిరి. జరిగినది నీకు తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చియున్నాననెను.
అతడు దావీదును దర్శించి నేలను సాగిలపడి నమస్కారము చేయగా దావీదు నీవెక్కడనుండి వచ్చితివని యడిగెను. అందుకు వాడు ఇశ్రాయేలీయుల సైన్యములోనుండి నేను తప్పించుకొని వచ్చితిననెను.
షేము కుమారులు ఏలాము అష్షూరు అర్పక్షదు లూదు అరామనువారు.
యెహోవా అతనిమీదికిని, తన సేవకులైన ప్రవక్తలద్వారా తాను సెలవిచ్చిన మాటచొప్పున యూదాదేశమును నాశనముచేయుటకై దానిమీదికిని, కల్దీయుల సైన్యములను సిరియనుల సైన్యములను మోయాబీయుల సైన్యములను ఆమ్మోనీయుల సైన్యములను రప్పించెను.
ఆకలిగొనినవారు అతని పంటను తినివేయుదురు ముండ్లచెట్లలోనుండియు వారు దాని తీసికొందురు బోనులు వారి ఆస్తికొరకు కాచుకొనుచున్నవి
బోను వారి మడిమెను పట్టుకొనును వల వారిని చిక్కించుకొనును.
నేను నా పనివాని పిలువగా వాడేమి పలుకకుండనున్నాడు నేను వాని బతిమాలవలసి వచ్చెను.
వారికి సంపాద్యము పూర్ణముగా కలిగిన సమయమున వారు ఇబ్బంది పడుదురు దురవస్థలోనుండు వారందరి చెయ్యి వారిమీదికి వచ్చును.
సరిహద్దు రాళ్లను తీసివేయువారు కలరు వారు అక్రమముచేసి మందలను ఆక్రమించుకొని వాటిని మేపుదురు.
భక్తిహీనుల పాశములు నన్ను చుట్టుకొనియున్నను నీ ధర్మశాస్త్రమును నేను మరువలేదు
బబులోనునుగూర్చియు కల్దీయుల దేశమునుగూర్చియు ప్రవక్తయైన యిర్మీయా ద్వారా యెహోవా సెలవిచ్చిన వాక్కు
గుఱ్ఱములనెక్కు బబులోనువారిని కల్దీయులను అధిపతులను ప్రధానాధికారులనందరిని అష్షూరీయులను సౌందర్యముగల శ్రేష్ఠులను అధిపతులను అధికారులను శూరులను మంత్రులను అందరిని నీమీదికి నేను రప్పించుచున్నాను.