లేఖనాలను అన్వేషించండి

యోబు 17: 3

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఏర్పాటు చేయుము దయచేసి నా నిమిత్తము నీ అంతట నీవే పూటపడుము మరి యెవడు నా నిమిత్తము పూటపడును?"

సంబంధిత రిఫరెన్స్‌లు

యోబు 9:33

మా యిద్దరిమీద చెయ్య ఉంచదగిన మధ్యవర్తి మాకులేడు.

ఆదికాండము 43:9

నేను అతనిగూర్చి పూటపడుదును, నీవు అతనిగూర్చి నన్ను అడుగవలెను; నేను అతని తిరిగి నీయొద్దకు తీసికొనివచ్చి నీయెదుట నిలువబెట్టనియెడల ఆ నింద నా మీద ఎల్లప్పుడును ఉండును.

ఆదికాండము 44:32

తమ దాసుడనైన నేను ఈ చిన్న వానినిగూర్చి నా తండ్రికి పూటపడి నీయొద్దకు నేనతని తీసికొని రానియెడల నా తండ్రి దృష్టియందు ఆ నింద నా మీద ఎల్లప్పుడు ఉండునని చెప్పితిని.

సామెతలు 11:15

ఎదుటివానికొరకు పూటబడినవాడు చెడిపోవును. పూటబడ నొప్పనివాడు నిర్భయముగా నుండును.

సామెతలు 20:16

అన్యునికొరకు పూటబడిన వాని వస్త్రమును పుచ్చుకొనుము పరులకొరకు వానినే కుదువ పెట్టించుము

హెబ్రీయులకు 7:22

ఆయన పశ్చాత్తాపపడడు అని యీయనతో చెప్పినవానివలన ప్రమాణ పూర్వకముగా యాజకుడాయెను.

సామెతలు 6:11

అందుచేత దోపిడిగాడు వచ్చునట్లు దారిద్ర్యము నీయొద్దకు వచ్చును. ఆయుధధారుడు వచ్చునట్లు లేమి నీయొద్దకు వచ్చును.

సామెతలు 11:15

ఎదుటివానికొరకు పూటబడినవాడు చెడిపోవును. పూటబడ నొప్పనివాడు నిర్భయముగా నుండును.

సామెతలు 17:18

తన పొరుగువానికి జామీను ఉండి పూటపడువాడు తెలివిమాలినవాడు.

సామెతలు 22:26

చేతిలో చెయ్యి వేయువారితోను అప్పులకు పూటబడువారితోను చేరకుము.

యోబు 31:35

నా మనవి వినుటకై నాకొకడు ఉండవలెనని నేనెంతో కోరుచున్నాను; ఇదిగో నా చేవ్రాలు గురుతు. ఇదిగో నా ప్రతివాది వ్రాసిన ఫిర్యాదు, సర్వశక్తుడు నాకుత్తరమిచ్చును గాక.